జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేసిన సినీ ప్రముఖులు

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టాలీవుడ్ ప్రముఖులు పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు.. నాగార్జున దంపతులు.. మంచు లక్ష్మి.. విజయ్ దేవరకొండతో పాటు ప్రముఖులు పోలింగ్ బూత్ కు ఉదయాన్నే తరలి వెళ్లారు. ఓటు హక్కును వినియోగించుకుని వారి పనుల్లో నిమగ్నం అయ్యేందుకు ఉదయం సమయంలోనే పోలింగ్ బూత్ కు చేరుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత పలువురు ప్రముఖులు చేతి వేలికి ఉన్న సిరాను చూపించి అందరి బాధ్యత ఓటు అన్నారు.

ఇంకా ప్రముఖులు పలువురు పోలింగ్ బూత్ వద్దకు చేరుకోలేదు. ఈ ఎన్నికల్లో సెలబ్రెటీలు తమ వంతు బాధ్యతగా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం చేయడంతో పాటు అంతా ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు వారు కూడా ముందుకు వచ్చి ఓటు వేయాలంటూ ఎలక్షన్ కమీషన్ విజ్ఞప్తి చేసింది. ఆ విజ్ఞప్తి మేరకు స్వయంగా విజయ్ దేవరకొండ ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ వీడియో బైట్ ను విడుదల చేయడం జరిగింది. సినీ ప్రముఖులు ఎక్కువ శాతం మంది బంజారా హిల్స్.. జూబ్లీహిల్స్.. ఫిల్మ్ నగర్ పరిధిలో ఉన్నాయి. ప్రముఖులు ఓట్లు వేసేందుకు వచ్చే బూత్ ల వద్ద పోలీసులు భారీ ఎత్తున బందో బస్తును ఏర్పాటు చేయడం జరిగింది.
× RELATED 'నేనేం చెయ్య' అంటూ 'ఎఫ్-సి-యూ-కే
×