ట్రెండీ టాక్: యాక్షన్ మోడ్ లో కాజల్.. వాళ్లదే ఆలస్యం!

పెళ్లి తర్వాతా నటించాలా వద్దా? అన్న డైలమా కొందరికి ఉంటుంది. అలాటిది ఏదీ లేకుండా పూర్తి క్లారిటీతో తిరిగి షూటింగులకు సిద్ధమవుతున్నారు చందమామ కాజల్. సతీమణికి వృత్తి పరమైన స్వేచ్ఛను ఇచ్చారు గౌతమ్ కిచ్లు. కాజల్ ఇప్పటికిప్పుడు క్రేజీగా నాలుగైదు సినిమాల్లో నటించాల్సి ఉంది.

ఇటవలే మాల్దీవుల్లో హనీమూన్ ముగించి తిరిగి పెండింగ్ షూటింగులను పూర్తి చేసేందుకు ప్రణాళికల్లో ఉన్నారట. అలాగే కొత్తగా ప్రారంభం కానున్న ఆచార్య షెడ్యూల్ విషయమై నిర్మాతల్ని ఆరా తీసారట. ఆచార్య షెడ్యూల్ రకరకాల కారణాలతో ఆలస్యమవుతోంది. చిరంజీవి- కొరటాల బృందం నుంచి క్లారిటీ వచ్చేస్తే కాజల్ కూడా సెట్స్ లో జాయిన్ అవుతారట. అలాగే ఇతర సినిమాల షూటింగుల వ్యవహారం కాజల్ తన నిర్మాతలతో చర్చిస్తున్నారని సమాచారం.

ఆ క్రమంలోనే హైదరాబాద్ టు చెన్నయ్ ప్రయాణాలతో కాజల్ బిజీగా ఉన్నారట. కాజల్ ప్రస్తుతం ఓ తమిళ హారర్ చిత్రంలో నటిస్తున్నారు. ఆ మూవీ కోసం లుక్ టెస్ట్ పూర్తయింది. షెడ్యూల్స్ కూడా ఖరారు చేసారని తెలుస్తోంది. ఇక ఇదే మూవీలో మరో ముగ్గురు అగ్ర కథానాయికలు నటించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన త్వరలో వస్తుంది. వచ్చే ఏడాది షూట్ ప్రారంభమవుతుంది.

మరోవైపు విశ్వనటుడు కమల్ హాసన్ -శంకర్ కాంబినేషన్ మూవీ భారతీయుడు 2 (ఇండియన్ 2) ఎప్పటినుంచి సెట్స్ కెళుతుంది? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపైనా కాజల్ ఆరా తీశారట. అలాగే కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ దర్శకత్వంలో `హే సినామికా`లో దుల్కర్ సల్మాన్ సరసన కాజల్ నటించనున్నారు. వీటితో పాటు తెలుగులో పలువురు దర్శకులు వినిపించిన కథల్ని కాజల్ వింటున్నారట. డెడికేషన్ అంటే చందమామ. అందుకే సౌత్ అగ్ర నాయికగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.
× RELATED విరాట్ కోహ్లీ తమన్నాకు హైకోర్టు నోటీసులు .. ఎందుకంటే ?
×