ఓటు వేయడానికి సినిమా షూటింగ్ మధ్యలో వదిలేసొచ్చిన నటుడు .. ఎవరంటే ?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ సమయం లోపు క్యూ లైన్ లో ఉన్నవారికి కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. అయితే అంతవరకు వేచి చూడకుండా వీలు చూసుకొని ఓటు వేసి వస్తే మీ భాద్యత కూడా తీరిపోతుంది. ఓటు హక్కు ఉండి ఓటు వేయకపోవడం అనేది మంచి పద్దతి కాదు. ఓటు హక్కు ఉండి ఓటు వేయకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కూడా కోల్పోతారు. కాబట్టి ఎవరి ఓటు హక్కు ని వారు తప్పకుండా వినియోగించుకోండి. ఇప్పటికే దాదాపుగా పోలింగ్ ప్రారంభమై నాలుగు గంటలు అవుతుంది. ఇప్పటివరకు ఓటింగ్ కొంచెం మందకొడిగానే సాగుతుంది. ఉదయం సమయంలోనే ప్రముఖులు సినీ స్టార్స్ ఓటు వేయడానికి ఉత్సహం చూపించారు.

ఇదిలా ఉంటే .. గ్రేటర్ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి నటుడు నిర్మాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా 300 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు. గుంటూరులో షూటింగ్ జరుగుతుంటే దాన్ని ఆపేసి తాను ఓటు వేయడానికి వచ్చినట్టు అయన చెప్పారు. లోక్ సభ అసెంబ్లీ ఎన్నికలు ఎంత ముఖ్యమో మున్సిపల్ ఎన్నికలు కూడా అంతే ముఖ్యమనే అభిప్రాయాన్ని ఓటర్లు గుర్తించాలని ఓటు హక్కు కలిగిఉన్న  ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.  ఇకపోతే 2009లో 42.92 శాతం ఓటింగ్ జరిగింది. 2016లో అది కేవలం మూడు శాతం పెరిగింది. గత ఎన్నికల్లో 45.27 శాతం మాత్రమే ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ సారైనా కూడా  కనీసం 50 శాతానికి పైగానైనా ఓటు హక్కు వినియోగించుకుంటారేమో చూడాలి.
× RELATED ఆచార్యకు 'జిగేల్ రాణి' భారీ డిమాండ్స్.. ఏంటంటే??
×