తస్సాదియ్యా తమన్.. ఏందయ్యా ఈ స్పీడు!

హుషారైన పాటలకు తమన్ పెట్టింది పేరు. అతడు కంపోజ్ చేసిన పాటలు అలా స్పీడ్ గా దూసుకెళ్తుంటాయి.  ఐతే ఇటీవల రూటు మార్చిన తమన్ ఎక్కువగా మెలోడీ పాటలు ఇస్తున్నాడు. అప్పట్నుంచి అతడికి విజయాలు వరుస కడుతున్నాయి. ఆఫర్లతో పోటెత్తుతున్నాయి. టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య ప్రధానంగా పోటీ ఉన్నది  దేవి శ్రీ ప్రసాద్ తమన్ మధ్యే. చాలా ఏళ్ల నుంచి  దేవిశ్రీప్రసాద్ తమన్ కంటే ఓ మెట్టు పైనే ఉంటూ వచ్చాడు.  కానీ ఇటీవల దేవిశ్రీప్రసాద్ వరుస అపజయాలతో నిలబడ్డాడు. అదే టైంలో తమన్ కెరీర్లో ఎన్నడూ లేనంత బెస్ట్ మ్యూజిక్ ఇవ్వడం మొదలుపెట్టాడు.  దీంతో అగ్రహీరోలంతా తమన్ వైపు  టర్న్ అయ్యారు. వరుస కట్టి వస్తున్న ఆఫర్లతో తమన్ ఉక్కిరి బిక్కిరి  అవుతున్నాడు.

 ఇప్పటికే అగ్ర హీరోలు పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట ఎన్టీఆర్ -త్రివిక్రమ్ మూవీ లను తమన్ చేస్తున్నాడు. ఇవి కాకుండా సాయిధరమ్ తేజ్ తో సోలో బ్రతుకే సో బెటర్ రవితేజతో క్రాక్ బాలయ్య - బోయపాటి మూవీ కళ్యాణ్ దేవ్ తో  సూపర్ మచ్చి మలయాళంలో షాజీకైలాష్ మూవీ కన్నడలో సుదీప్ తో బెబ్బులితో పాటు మరికొన్ని సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు తాజాగా సాగర్ చంద్ర దర్శకత్వంలో  పవన్ కళ్యాణ్ చేస్తున్న 30 వ సినిమాకు మ్యూజిక్ చేసే  ఛాన్స్ తమన్  అందుకున్నాడు. పవన్ తో చేస్తున్న వకీల్ సాబ్ ఇంకా విడుదల కూడా కాకముందే ఆయనతో పని చేసే అవకాశం మరోసారి రావడంతో తమన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. ఒకప్పుడు త్రివిక్రమ్ కొరటాల శివ బోయపాటి శ్రీను వంటి డైరెక్టర్లకు ఆస్థాన సంగీత దర్శకుడిగా మెలిగిన దేవిశ్రీ ఇప్పుడు వారి సినిమాలకే  అవకాశాలు దక్కకపోవడం విశేషం. ప్రస్తుతం దేవిశ్రీ చేతిలో అగ్ర హీరోల సినిమాలు అల్లు అర్జున్ పుష్ప పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలు మాత్రమే ఉన్నాయి. అగ్ర హీరోల సినిమాల్లో  మెజారిటీ సినిమాలు తమన్ చేతిలోనే  ఉన్నాయి.
× RELATED మరో అరుదైన గౌరవంను దక్కించుకున్న రహమాన్
×