బేబి బంప్ తో స్టేడియంలో అనుష్క..అయినా విరాట్ టీమ్ కి ఓటమి!!

విరుష్క జంట ఇటీవలే తమ కుటుంబంలోకి మూడో వ్యక్తిని ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు శుభాకాంక్షలతో ఆ జంటను విష్ చేశారు. ఇక విరాట్ ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ లతో ఫుల్ బిజీ. ఆ క్రమంలోనే బేబి బంప్ తోనే అనుష్క మ్యాచ్ ల వీక్షణకు స్టేడియంకి విచ్చేస్తోంది.

విరాట్ కోహ్లీని ఉత్సాహపరుస్తూ బేబీ బంప్ ను ప్రదర్శిస్తూ అనుష్క శర్మ నిన్నటిరోజున ఐపీఎల్ మ్యాచ్ లో స్టేడియంకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శర్మా గాళ్ రెడ్ డ్రెస్ లో చాలా అందంగా కనిపించింది. నిన్న జరిగిన ఆర్.సి.బి వర్సెస్ సి.ఎస్.కె మ్యాచ్ లో చప్పట్లు కొట్టడంతో అనుష్క శర్మ అభిమానుల కంట పడింది. ప్రస్తుతం ఆ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.

అనుష్క శర్మ భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ అదృష్టం అనే చెప్పాలి. తనో గొప్ప ఆకర్షణ. అనుష్క ప్రస్తుతం యుఎఇలో ఐపిఎల్ మ్యాచ్ లలో లైఫ్ ఉత్తమ సమయం గడుపుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి) తరఫున ఆడుతున్న భర్త.. భారత క్రికెటర్ విరాట్ కోహ్లీని ఆటపరంగా ఉత్సాహపరిచే పనిలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్లో... సూపర్ స్టార్ తన భర్త కోసం గ్యాలరీ నుంచి చిలౌట్ గా కనిపించింది. విరాట్ కోసం చప్పట్లు కొట్టడంతో అనుష్క పైనే స్టేడియంలో కళ్లన్నీ.

అనుష్క ఆగస్టు 27 న తన గర్భం విషయాన్ని ప్రకటించింది. దీంతో క్రికెట్ - ఎంటర్ టైన్మెంట్ ప్రపంచం రెండింటా తుఫాన్ హోరు కనిపించింది. జనవరి 2021 లో బిడ్డకు జన్మనివ్వాలని ఆశిస్తున్నట్లు ఆమె వెల్లడించింది. ఇక నిన్నటిరోజున దురదృష్టవశాత్తు.. ఆర్.సి.బి సి.ఎస్.కె చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ తరువాత.... విరాట్ మాట్లాడుతూ.. మ్యాచ్ చాలా గట్టి పోటీతో నడిచిందని ఆర్.సిబి మెరుగైన బౌలింగ్ చేసి ఉంటే గెలిచేందుకు తగిన అవకాశం ఉండేదని చెప్పాడు. కెరీర్ సంగతి చూస్తే.. అనుష్క శర్మ చివరిసారిగా 2018 జీరోలో కనిపించింది.. ఇందులో కత్రినా కైఫ్ మరియు షారూఖ్ ఖాన్ కూడా ఉన్నారు. ఆ తర్వాత వేరొక సినిమా గురించిన అప్ డేట్ రాలేదు.
× RELATED నెల అయ్యింది.. కాజల్ భర్త రొమాంటిక్ పోస్ట్
×