పేరుకి మాత్రం పెద్ద ఎస్సై.. చేసే పనులు మాత్రం అన్ని అవే!

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతయుత వృత్తిలో ఉండి చేస్తున్న పనికే కలంకం తీసుకువచ్చాడు ఓ ప్రబుద్దుడు. ధర్మానికి అండగా నిలవాల్సిన పోలీస్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి మహిళను టార్గెట్ చేస్తూ వారిపై వేధింపులకు పాల్పడ్డాడు. చివరికి బండారం బయటపడి జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.  శాంతి భద్రతలను పర్యవేక్షిస్తూ.. మహిళలకు రక్షణ ఇవ్వాల్సింది పోయి వేధిస్తున్నారు. మహిళలు యువతులను వేధిస్తోన్న ఘటనలు వెలుగులోకి  వస్తుండటం గమనార్హం. ఈ ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది.

ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ఎస్ఐ పునీత్ గరేవాలా.. ట్రాఫిక్ డీసీపీ వద్ద పీఏగా పనిచేస్తున్నారు. అతను ద్వారకలో నివసిస్తున్నారు. అయితే కాలనీలో మహిళలు యువతులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. నంబర్ ప్లేట్ లేని కారులో తిరుగుతూ.. మహిళలు యువతుల చూస్తున్నాడు. వారిని చూస్తూ కారులోనే హస్తప్రయోగం చేసుకుంటున్నాడు. అతనిని చూసిన మహిళలు నోరెళ్లబెట్టారు. ఏంటీ ఇదీ అని ఇబ్బందికి గురయ్యారు. జరిగిన ఘటనపై పోలీసులను ఆశ్రయించారు.

 దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ద్వారక ప్రాంతంలో పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. సంఘటన స్థలంలో వ్యక్తి ఉపయోగించిన కారు ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి శనివారం అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు దర్యాప్తులో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. నిందితుడు జనక్ పురికి చెందిన పునీత్ గరేవాల్ ఢిల్లీలో సబ్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నట్లు తేలింది. నిందితునిపై ఏపీసీ సెక్షన్లు 354డీ354 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతని చేష్టలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే కాదు గతంలో ఏమైనా ఘటనలు ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారా అని ఆరా తీస్తున్నారు. ఒకవేళ నిజమని తేలితే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
× RELATED గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం టార్గెట్ 50
×