టాప్ స్టోరి: OTT లో ఆ నలుగురు బిగ్ ఫైట్

థియేటర్లు మూత పడడంతో డిజిటల్ హవా కొనసాగుతోంది. అయితే ఓటీటీ రిలీజ్ లకు సరిపడా కంటెంట్ రెడీగా ఉందా? అంటే అది కూడా కష్టంగానే మారింది. దీనికి కారణం షూటింగులు వాయిదా పడడమే. ఒకే ఒక్క సూర్య సినిమా మినహా టాలీవుడ్... కోలీవుడ్కు చెందిన చాలా మంది ప్రముఖ హీరోలు నటించిన సినిమాలేవీ వచ్చే రెండు నెలల్లో విడుదల చేయడానికి సిద్ధంగా లేవ్. అయితే ఇదే అదనుగా ఓ నలుగురు అగ్ర కథానాయికలు ఓటీటీ వేదికపై బిగ్ ఫైట్ కి సిద్ధమవుతుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఆ నలుగురు భామలు ఎవరెవరు? అన్నది ఆరా తీస్తే.. నయనతార- కాజల్ అగర్వాల్- తమన్నా- సమంత..  ఈ భామలు నటించిన సినిమాలు నవంబర్ డిసెంబర్ లో ఒటిటి వేదికలపై దుమారం రేపనున్నాయి. నయనతార తమిళ భక్తి వ్యంగ్యాస్త్రం `ముకుతి అమ్మన్` ఓటీటీలో రిలీజ్ కి రెడీ అవుతోంది. దసరా కానుకగా ఇప్పటికే ప్రచార హోరు మొదలైంది. ఈ చిత్రం నవంబర్ లో డిస్నీ హాట్ స్టార్ ప్లస్ లో ప్రత్యక్షంగా విడుదల కానుంది.

ఆపై కాజల్ అగర్వాల్ తొలి వెబ్-సిరీస్ `లైవ్ టెలికాస్ట్` నవంబర్ నెలలోనే డిస్నీ హాట్ స్టార్ ప్లస్ లో ప్రసారం కానుంది. కొన్ని రోజుల క్రితం ఆవిష్కరించిన సిరీస్ ‘స్ట్రైకింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్’ ఉత్సుకతను పెంచింది. మరో స్టార్ హీరోయిన్ తమన్నా కూడా తమిళ థ్రిల్లర్ సిరీస్ `నవంబర్ స్టోరీ`తో తన OTT అరంగేట్రం చేయబోతోంది .. ఇది కూడా నవంబర్ లోనే డిస్నీ హాట్ స్టార్ ప్లస్ లో డిజిటల్ ప్రీమియర్ ప్రదర్శనకు సిద్ధమవుతోంది.

చివరగా స్టార్ హీరోయిన్ సమంత నటించిన `ది ఫ్యామిలీ మ్యాన్` సీజన్ 2 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. సక్సెస్ ఫుల్ సిరీస్ సీక్వెల్ తో తన OTT అరంగేట్రం కోసం సమంత ఎంతో ఎగ్జయిటింగ్ గా వెయిట్ చేస్తోంది. ఈ సిరీస్ డిసెంబర్ నుండి ఓటీటీలో ప్రసారం కానుంది. నలుగురు భామల ఓటీటీ ప్రవేశం హీట్ పెంచుతోంది. రేస్ లో ఎవరు ది బెస్ట్ అన్నదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రజాధరణను బట్టి సిరీస్ పెర్ఫామెన్స్ లో పేరు ప్రఖ్యాతుల్ని బట్టి సక్సెస్ డిసైడవుతుంది.
× RELATED నెల అయ్యింది.. కాజల్ భర్త రొమాంటిక్ పోస్ట్
×