టాక్ ఆఫ్ ది డే.. నెట్ ఫ్లిక్స్ లో బాండ్ 25 వ చిత్రం

బాండ్ సిరీస్ లో 25వ చిత్రం `నో టైమ్ టు డై` టైమ్ ఏమంత బావున్నట్టు లేదు.ఇప్పటికే ఈ మూవీ విడుదల పలుమార్లు వాయిదా పడింది. మహమ్మారీ దెబ్బకు అంతకంతకు వెనక్కి వెళ్లిపోతోంది. ఇటీవలే ఏప్రిల్ 2021 వరకు వాయిదా పడిందని కథనాలొచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేనందును ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లేదా ఆపిల్ స్ట్రీమింగ్ కి విక్రయించనున్నారని ప్రచారమవుతోంది. ఆ మేరకు చిత్రబృందంపై తీవ్ర ఒత్తిడి నెలకొందని ప్రముఖ హాలీవుడ్ వెబ్ సైట్లు కథనాల్ని వెలువరించాయి.

రాబోయే జేమ్స్ బాండ్ చిత్రం నో టైమ్ టు డై థియేటర్లలో కాకుండా నేరుగా స్ట్రీమింగ్కు వెళ్ళవచ్చు అన్న ఊహాగానాలు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారాయి. బాండ్ సిరీస్లోని 25 వ చిత్రం .. అలాగే డేనియల్ క్రెయిగ్ నటిస్తున్న 007 సిరీస్ చివరి చిత్రం `నో టైమ్ టు డై` 2020 బెస్ట్ క్రేజీ చిత్రంగా చర్చల్లో ఉంది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఆలస్యం అయిన ముందు వరుస చిత్రమిదన్న చర్చా సాగుతోంది. ఈ నవంబర్ లో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఏప్రిల్ 2021 వరకు వాయిదా పడింది.  

క్రిస్టోఫర్ నోలన్ టెనెట్ ఇప్పటివరకు ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు తీసుకువచ్చే ప్రయత్నంలోనే ఉంది. అమెరికా వసంతకాలంలో పెద్ద తెరపైకి వచ్చిన ఏకైక బ్లాక్ బస్టర్ చిత్రమిదే. కానీ ఇది యుఎస్ మార్కెట్లో ఆశించినంతగా కలెక్షన్లు సాధించలేదు. థియేటర్లు మూసివేయడమే దీనికి కారణం.

ప్రస్తుతం బాండ్ సినిమా పరిస్థితి చూస్తుంటే.. నెట్ఫ్లిక్స్ లేదా ఆపిల్ టీవీ + వీటిలో స్ట్రీమింగ్ కావచ్చు అన్న ఊహాగానాలు సాగుతున్నాయి. థియేటర్లను వదిలేసి నో టైమ్ టు డైని అత్యధిక బిడ్డర్ కు విక్రయించడానికి MGM ఒత్తిడిలో ఉందని కథనాలొస్తున్నాయి. పలు స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంలు ఈ చిత్రాన్ని చాలా పెద్ద మొత్తం చెల్లించి కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. నో టైమ్ టు డై నిర్మాణానికి బడ్జెట్ $ 250 మిలియన్లు ఖర్చయ్యింది. కాబట్టి థియేట్రికల్ విడుదలను అధిగమించాలంటే.. స్ట్రీమింగ్ బిడ్లు అనూహ్యంగా భారీ మొత్తంలో ఉండాలని అంచనా వేస్తున్నారు.

మహమ్మారి కారణంగా థియేటర్లు తెరవడం ఆలస్యం అయిన తరువాత ఆపిల్ టీవీ + ఈ సంవత్సరం ప్రారంభంలో టామ్ హాంక్స్ `గ్రేహౌండ్స్` ని కొనుగోలు చేసినప్పుడు బాండ్ సినిమాని కొనుగోలు చేయాలని భావించింది. పారామౌంట్ పిక్చర్స్ ఇటీవల ఎదురుచూస్తున్న ఎడ్డీ మర్ఫీ సీక్వెల్ `కమింగ్ 2 అమెరికా`ను అమెజాన్ స్టూడియోస్ కు డిసెంబర్ లో ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయడానికి 125 మిలియన్ డాలర్ల ఒప్పందంలో కొనుగోలు చేసింది.
× RELATED నెల అయ్యింది.. కాజల్ భర్త రొమాంటిక్ పోస్ట్
×