65 ఏళ్ల వయసులో హరీష్ సాల్వే రెండో పెళ్లి

సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే మరోసారి వార్తల్లోకి ఎక్కారు. హైప్రొఫైల్ కేసులను మాత్రమే వాధించే ఖరీదైన న్యాయవాదిగా దేశవ్యాప్తంగా పేరొందిన ఆయన రెండో వివాహానికి రెడీ కావడం వైరల్ అయ్యింది.

65 ఏళ్ల వయసులో ఆయన రెండో పెళ్లికి సిద్ధపడుతున్నాడు. సొలిసిటర్ జనరల్ గా పదవీ కాలం ముగియడంతో ఆయన ప్రస్తుతం లండన్ లో నివసిస్తున్నాడు.  లండన్ వేల్స్ లో క్వీన్స్ కౌన్సిల్ సభ్యుడిగా ఆయన ఎన్నికయ్యారు.

మహారాష్ట్రకు చెందిన హరీష్ సాల్వే ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. తన భార్య మీనాక్షి సాల్వేకు ఈ ఏడాది జూన్ లో విడాకులు ఇచ్చారు. చట్టపరంగా విడాకులు ఇచ్చారు.

1982లో హరీష్ సాల్వే.. మీనాక్షిని వివాహం చేసుకున్నాడు. సాల్వే దంపతులకు ఇద్దరు కుమార్తెలు. 38 ఏళ్ల వైవాహిక జీవితానికి తాజాగా సాల్వే వీడ్కోలు పలికారు.

ప్రస్తుతం హరీష్ సాల్వే లండన్ కు చెందిన ప్రముఖ కళాకారిణి కరోలిన్ బ్రొస్సార్డ్ ను వివాహం చేసుకోబోతున్నారు. ఈమె వయసు 56 సంవత్సరాలు.. ఆమెకు ఇదివరకే పెళ్లి అయ్యింది. 18 ఏళ్ల కూతుకురు కూడా ఉంది. ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో ఆమె పరిచయం ఏర్పడి ఇప్పుడు వివాహానికి దారితీసింది.

    

× RELATED చంద్రబాబుకు మొదటి అనుభవం
×