అంబానీ వర్సెస్ అమెజాన్ అధినేత.. 1.92 లక్షల కోట్లు ఆవిరి

ముంబై స్టాక్ మార్కెట్లు సోమవారం చిగురుటాకులా వణికాయి.. సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 540 పాయింట్లు నష్టపోయింది. 40145.50 వద్ద ముగిసింది. నిఫ్టీ 162.60 పాయింట్లు (1.36శాతం) దిగజారి 11767.80 వద్ద ముగిసింది.

మార్కెట్లు కుప్పకూలడంతో ఒక్కరోజే 1.92 లక్షల కోట్ల పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడం.. అమెరికా సహా పలు మార్కెట్లు నష్టపోవడంతో ఈ ప్రభావం మన మార్కెట్ పైన పడింది.

వీటికి అదనంగా భారత దిగ్గజ కంపెనీ బీఎస్ఈలో 17శాతం వాటా కలిగిన రిలయన్స్ 3.70శాతం మేర నష్టపోవడంతో భారీగా దెబ్బతీసింది. రిలయన్స్ కు భారీ నష్టం వాటిల్లింది.  బీఎస్ఈలో ఒక్కరోజే పెట్టుబడిదారుల సంపద రూ.158.66 లక్షల కోట్లకు పడిపోయాయి.
 
దేశంలోనే కుబేరుడైన ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడైన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మధ్య ‘ఫ్యూచర్ గ్రూప్’ కొనుగోలుపై పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఇప్పటికే ఫ్యూచర్ గ్రూపును రిలయన్స్ రూ.24వేల కోట్లకు పైగా పెట్టుబడితో కొనుగోలు చేసింది. దీనిపై అమెజాన్ కంపెనీ కోర్టుకు వెళ్లింది. అమెజాన్ కు ఊరటనిచ్చేలా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రిలయన్స్ షేర్ భారీగా పడిపోయింది.
× RELATED గ్రేటర్ పోరు : మంత్రి పువ్వాడ అజయ్ వాహనంపై దాడి !
×