#పెళ్లి సందడి.. ఊహ కళ్లు శ్రీకాంత్ లుక్కుతో దిగిపోయాడు!

1996 రొమాంటిక్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘పెళ్లి సందడి’ నటుడు శ్రీకాంత్ కెరీర్ లో కీలక మలుపు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ క్లాసిక్ చిత్రం భారీ విజయాన్ని సాధించడమే గాక ఈ చిత్రంలో నటించిన నటీనటులకు మంచి పేరు తీసుకువచ్చింది. ముఖ్యంగా ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ రాకింగ్ అనే చెప్పాలి. శ్రీకాంత్ ను బాక్సాఫీస్ పరంగా ఆధారపడదగ్గ స్టార్ గా ఆవిష్కరించింది ఈ చిత్రం. హిందీ .. తమిళ భాషలలో కూడా రీమేకై అక్కడా సంచలన విజయం సాధించింది.
 
ఈ క్లాసిక్ విడుదలై దాదాపు 25 సంవత్సరాల తరువాత సీక్వెల్ రూపొందుతోంది. శ్రీకాంత్ కుమారుడు రోషన్ కథానాయకుడిగా నటించనున్నారు. రోషన్ ఇప్పటికే మూడేళ్ల క్రితం `నిర్మలా కాన్వెంట్` అనే చిత్రంలో టీనేజ్ స్టార్ గా అరంగేట్రం చేశాడు. ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోయినా కానీ రోషన్ నటనకు విజువల్ బ్రిలియన్సీకి ఫిదా అయిపోయారు. టాలీవుడ్ కి మరో లవర్ బోయ్ దొరికాడని కితాబిచ్చారు క్రిటిక్స్. ఇక రోషన్ రెండో సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు.

అతడిని సరైన సినిమాతో పూర్తి స్థాయి హీరోగా లాంచ్ చేయాలని శతాధిక చిత్రాల హీరో శ్రీకాంత్ చాలా కాలంగా వేచి చూస్తున్నారు. అందుకోసం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు బరిలో దిగడం ఆసక్తికరం. ఇప్పుడు రాఘవేంద్రుని దర్శకత్వ పర్యవేక్షణలో ‘పెళ్లిసందడి’ టైటిల్ తోనే ఈ సీక్వెల్ గౌరీ రోనాంకీ దర్శకత్వం వహించేందుకు సిద్ధమవుతున్నారు. #పెళ్లి సందడి సీక్వెల్ ప్రకటనతో మరోసారి క్యూరియాసిటీ పెరిగింది. ఊహ కళ్లు శ్రీకాంత్ లుక్కుతో మ్యాజిక్ చేస్తాడా? అంటూ రోషన్ పై మరోసారి ఆసక్తికర చర్చ సాగుతోంది. తాజాగా ఆర్కా సంస్థ అధికారిక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో రోషన్ స్మార్ట్ లుక్ లవర్ బోయ్ ఇమేజ్ కి సరిపడే విధంగా ఆవిష్కృతమైంది.

కె కృష్ణ మోహన్ రావు తో కలిసి అర్కా మీడియా వర్క్స్ ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ని నిర్మించనుంది. ఇందులో కథానాయిక ఎవరు? అన్నది ఫైనల్ కావాల్సి ఉంది. రెగ్యులర్ షూట్ త్వరలో ప్రారంభమవుతుంది.
× RELATED ఫోటో స్టోరి: చీరలో అదరొట్టిన స్టైలిష్ స్టార్ వైఫ్!
×