మోసపోయిన మంగళగిరి ఎమ్మెల్యే

ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేనే మోసం చేశారు. ఇదిప్పుడు సంచలనంగా మారింది. గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విత్తన కంపెనీ చేతిలో దారుణంగా మోసపోయిన వైనం వెలుగుచూసింది.

వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాజాగా తనకు చెందిన 14 ఎకరాల్లో  పంట వేశారు. అందులో ఖాత కాయలేదు.. 5 ఎకరాల్లో నకిలీ విత్తనాలు బయటపడడం సంచలనంగా మారింది.

ఏపీ సీడ్స్ ద్వారా మంజీరా కంపెనీ విత్తనాలను ఎమ్మెల్యే ఆర్కే కొనుగోలు చేశారు. అయితే నకిలీ విత్తనాలుగా అవి బయటపడ్డాయి. ఖాతా కాయకపోవడంతో వెంటనే ఎమ్మెల్యే ఆర్కే వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేనే మోసం చేసిన వైనంపై అధికారులు సీరియస్ గా స్పందించారు. వెంటనే ఈ విత్తనాలు ఎలా వచ్చాయనే దానిపై విచారణకు ఆదేశించారు.
× RELATED కారులో లేని బండి మీద హత్యాయత్నం జరిగిందా?
×