బ్రేకింగ్: నారా లోకేష్ కు తప్పిన భారీ ప్రమాదం!

పండుగ పూట తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు పెను ప్రమాదం తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పర్యటనలో ఉన్న నారా లోకేష్  ఆ పర్యటనలో భాగంగా ట్రాక్టర్ పై ఎక్కగా.. అది ప్రమాదానికి గురైంది.

స్థానికులు వెంటనే స్పందించబట్టి సరిపోయింది. లేకుంటే పెను ప్రమాదం వాటిల్లేది. స్థానికులు అప్రమత్తం కావడంతో నారా లోకేష్ తప్పించుకున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా అకివీడు ప్రాంతంలో పర్యటిస్తున్న లోకేష్ పార్టీ నేతలు నిమ్మల రామానాయుడు మంతెన రామరాజుతో కలిసి ట్రాక్టర్ పై వెళ్లారు.

ఈ క్రమంలోనే నారా లోకేష్ ట్రాక్టర్ నడుపుతుండగా.. అది కాల్వ వైపు ఒరిగింది. వెంటనే తేరుకొని ట్రాక్టర్ ను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
× RELATED గ్రేటర్ పోరు : మంత్రి పువ్వాడ అజయ్ వాహనంపై దాడి !
×