అదే పని.. ఇప్పటిదాకా 150 మందిని తల్లులను చేశాడు

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఇతగాడు 150 మంది మహిళలను తల్లులను చేశాడు. అతగాడి పేరు జోయ్ డోన్. ఇప్పుడీ వ్యక్తి వీర్యానికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఏర్పడింది. జోయ్ ఏకంగా 150 మంది పిల్లలకు తండ్రిగా మారిపోయాడు. కరోనా లాక్ డౌన్ వంటి క్లిష్ట సమయంలోనూ మరో ఆరుగురు మహిళలను తల్లులను చేశాడితడు.

జోయ్ డోన్ ఒక ఫేమస్ వీర్యదాత. అగ్రరాజ్యం అమెరికాలోని వెర్ మౌంట్ కు చెందిన 49 ఏళ్ల జోయ్ ఈ వయసులోనే అమ్మాయిలకు కడుపు చేయడమే పనిగా పెట్టుకొని అదే పనిలో ఉన్నాడట.. తనకు 90 ఏళ్ల వరకు వీర్యదానం చేస్తానని గర్వంగా చెబుతున్నాడు. తన వీర్యాన్ని బ్యాంకుల్లో ఇవ్వకుండా కావాల్సిన అమ్మాయిలకు సహజ పద్ధతుల్లోనే నేరుగా అందిస్తాడట.. దీంతో ఇతడి వీర్యానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ అమాంతం పెరిగిపోయింది.

కరోనా లాక్ డౌన్ లో చాలా మంది తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతే జోయ్ మాత్రం చాలామందితో సెక్స్ చేస్తూ ఎంజాయ్ చేశాడట.. తల్లి కావాలనుకునే అమ్మాయిల ఇళ్లకు వెళ్లి మరీ వారికి బెడ్ రూం మజాను అందించడమే కాదు.. వారు తల్లులు అయ్యే అవకాశాన్ని కల్పించాడట.. ఈ కరోనా టైంలో అనేకమంది అమ్మాయిలతో జోయ్ శృంగారంలో పాల్గొని ఫుల్ గా ఎంజాయ్ చేశాడట..

ఇప్పటివరకు తాను 150 మంది పిల్లలకు తండ్రి అయ్యానని.. ఏడాదికి కనీసం 10మంది అమ్మాయిలనైనా అమ్మలు చేస్తున్నానని తెలిపాడు. తల్లులు అవుదామనుకునే మహిళలు అమ్మాయిలు తనను సంప్రదించాలని నేరుగానే ఆఫర్ ఇస్తున్నాడు. ఇప్పుడీ వ్యక్తి ప్రకటన అమెరికాలో వైరల్ అవుతోంది.
× RELATED మెహబూబాకు నిరసనల సెగ...షాకిచ్చిన సొంత పార్టీ నేతలు
×