కువైట్ ప్రభుత్వం సంచలన నిర్ణయం .. ఏంటంటే !

కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో కువైట్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.  కువైట్ వచ్చే ప్రతిఒక్కరికీ పీసీఆర్ టెస్టు సర్టిఫికేట్ తప్పనిసరి అని అధికారులు ప్రకటించారు. ఇకపై విమానాశ్రయంలో చేసే స్వాబ్ టెస్టు 14 రోజుల క్వారంటైన్ కాకుండా పీసీఆర్ టెస్టు సర్టిఫికేట్ కూడా తప్పనిసరి అని ప్రభుత్వ అధికార ప్రతినిధి తారిఖ్ అల్ ముజ్రిమ్ తెలిపారు. అలాగే కువైట్ ఆరోగ్యశాఖ అమలు చేస్తున్న కరోనా నిబంధనలు ఉల్లఘించే వారిని కూడా దేశంలో ప్రవేశించడాన్ని అనుమతించబోమని ఆయన  తెలిపారు.

అరబ్ కమ్యూనిటీకి చెందిన వారు ఎవరైతే పొరుగు దేశాల్లో చిక్కుకున్నారో వారికి కరోనా  నిబంధనల నుంచి మినహాయింపు ఉన్నట్లు మీడియాలో వచ్చిన కథనాలను ఆయన ఖండించారు. ఎవరికైనా  మినహాయింపులేమి లేవని అందరూ తప్పనిసరిగా కరోనా నియమాలు  పాటించాల్సిందేనని తారిఖ్ అల్ ముజ్రిమ్ తెలిపారు. గత కొద్ది రోజులుగా కువైట్ లో కరోనా బారినపడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్న తరుణంలో  ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తారిఖ్ తెలిపారు. కాబట్టి కువైట్ వెళ్లాలని అనుకునే వారు ఈ సర్టిఫికెట్స్ ను వెంట బెట్టుకొని వెళ్లండి.
× RELATED టీడీపీలో పెరిగిపోతున్న 'వడ్డీ' ల గోల
×