వైరల్: కశ్మీర్ లో లొంగిపోయిన టెర్రరిస్ట్

ఉగ్రవాదుల్లో కరుడుగట్టిన వారుంటారు.. తమ జీవితాంతం జిహాద్ అంటూ పోరాడుతారు. ప్రజల ప్రాణాలను రాక్షసంగా చంపేస్తుంటారు. ఉగ్రవాద సంస్థ బాగా  లేకపోయినా వదులడానికి ఇష్టపడరు. టెర్రరిస్టులు చావనైనా చస్తారు కానీ లొంగిపోవడానికి ఇష్టపడరు. అయితే తాజాగా షాకింగ్ ఘటన వెలుగుచూసింది. జమ్మూ కశ్మీర్లో ఒక ఉగ్రవాది భారత సైన్యానికి లొంగిపోవడం ఈ అరుదైన ఘటనగా నిలిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

భారత సైన్యం శుక్రవారం ఉదయం ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా  టెర్రరిస్టును లొంగిపోవాలని చేసిన ప్రయత్నం ఫలించింది. ఈ సందర్భంగా 31 ఏళ్ల జహంగీర్ ఆహ్ భట్ అనే ఉగ్రవాది భారత సైన్యానికి లొంగిపోయాడు.   తనతో పాటు ఏకే 47 రైఫిల్ను సైన్యానికి అప్పగించి లొంగిపోయాడు. వీడియోలో సైన్యం భట్ను లొంగిపోయేలా ఒప్పించడంలో సక్సెస్ అయ్యింది.

“మీ కుటుంబం కోసం లొంగిపోండి. అతనికి నీళ్ళు ఇవ్వండి. దయచేసి అతడికి దూరం ఉండండి.. మీకు ఏం జరగదు.. మీరు లోంగిపోండి ”అని ఒక ఆర్మీ ఆఫీసర్ ఈ వీడియోలో ఉగ్రవాదిని ఒప్పించడం కనిపించింది. ఉగ్రవాది భట్ సైనికుల వైపు ఏకే 47 వదిలేసి లొంగిపోవడం వీడియోలో కనిపిస్తుంది.

తరువాత సైన్యం మరొక వీడియోను విడుదల చేసింది. దీనిలో ఉగ్రవాది భట్ తండ్రి అధికారులతో సంభాషిస్తున్నాడు. భట్ తండ్రి కొడుకును చూడగానే ఉద్వేగానికి లోనయ్యాడు. తన కొడుకును ఎన్ కౌంటర్ చేయనందుకు.. రక్షించమన్నందుకు ఉగ్రవాది తండ్రి సైనికుల పాదాలను తాకడం వీడియోలో కనిపించింది.ఇది ఉద్వేగంగా మారింది.× RELATED టీడీపీలో పెరిగిపోతున్న 'వడ్డీ' ల గోల
×