న్యూ పోస్టర్ తో 'రామరాజు ఫర్ భీమ్' సందడి షురూ చేసిన 'RRR' టీమ్...!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో చరణ్ 'అల్లూరి సీతారామరాజు'గా 'రౌద్రం' చూపిస్తుండగా.. ఎన్టీఆర్ 'కొమరం భీమ్'గా 'రుధిరం' చూపించనున్నాడు. కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమై శరవేగంగా జరుపుకుంటోంది. చెర్రీ బర్త్ డే సందర్భంగా 'భీమ్ ఫర్ రామరాజు' పేరుతో స్పెషల్ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబర్ 22న తారక్ కి సంబంధించిన స్పెషల్ టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. మరో ఐదు రోజుల్లో 'రామరాజు ఫర్ భీమ్' వీడియో రాబోతుందని వెల్లడిస్తూ మేకర్స్ తాజాగా కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు.

'ఇంచింగ్ క్లోజర్' అంటూ 'RRR' టీమ్ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ నీళ్లలో.. చరణ్ అగ్నిలో పరుగెడుతూ కనిపిస్తున్నారు. మొత్తం మీద కొన్ని నెలలుగా తారక్ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చేస్తున్న అభిమానులకు మరో ఐదు రోజుల్లో జక్కన్న ట్రీట్ ఇవ్వనున్నాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడీగా ఐరిష్ బ్యూటీ ఒలివియా మోరిస్ నటిస్తుండగా.. చరణ్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కతున్న ఈ మూవీలో అజయ్ దేవగన్ - శ్రియా శరణ్ - సముద్రఖని - అలిసన్ డూడీ - రే స్టీవెన్సన్ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తుండగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
× RELATED అభిమానులను నిరాశపర్చిన అసిన్
×