దసరాకు ముందే 'వకీల్ సాబ్'లో పవన్

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ ఇటీవలే పునః ప్రారంభం అయ్యింది. పవన్ లేకుండానే కొందరు కీలక నటీనటులతో షూటింగ్ చేసిన దర్శకుడు త్వరలో పవన్ తో షూటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇటీవలే పవన్ దసరా తర్వాత వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. డిసెంబర్ వరకు వకీల్ సాబ్ షూటింగ్ ను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. దాదాపుగా 20 నుండి 25 రోజుల వరకు పవన్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. మొన్నటి వరకు ప్రచారం జరిగిన విధంగా కాకుండా దసరాకు ముందే అంటే ఈనెల 23 నుండే పవన్ వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడని యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది.

బాలీవుడ్ మూవీ పింక్ కు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కీలక పాత్రలను నివేథా థామస్ మరియు అంజలి చేస్తున్నారు. ఇక పవన్ కు జోడీగా శృతి హాసన్ కనిపించబోతుంది. ఒరిజినల్ వర్షన్ లో శృతి హాసన్ పాత్ర ఉండదు. కాని తెలుగు ప్రేక్షకులు మరియు పవన్ ఫ్యాన్స్ కోసం కాస్త కమర్షియల్ టచ్ ఇవ్వడం కోసం శృతి హాసన్ పాత్రను జోడిస్తున్నారు. ఆమెది కథతో సంబంధం లేకుండా ఒక గెస్ట్ రోల్ గా ఉంటుందని తెలుస్తోంది. ఒరిజినల్ వర్షన్ ను ఎక్కువగా మార్చకుండా కాస్త కమర్షియల్ హంగులు మాత్రమే అద్దినట్లుగా దర్శకుడు వేణు శ్రీరామ్ ఇటీవలే ప్రేర్కొన్నాడు.

ఈ సినిమాను అంతా బాగుంటే సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ ఈ సినిమాతో రాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. కనుక భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. థియేటర్లు పూర్తి స్థాయిలో నడిచే సమయంలో ఈ సినిమాను విడుదల చేస్తే ఓపెనింగ్స్ కలెక్షన్స్ సరికొత్త రికార్డులను నమోదు చేస్తాయని అభిమానులు చాలా బలంగా నమ్ముతున్నారు. ఎప్పుడు విడుదల అయ్యేది మరికొన్ని రోజుల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ల
× RELATED టాక్ ఆఫ్ ది డే.. నెట్ ఫ్లిక్స్ లో బాండ్ 25 వ చిత్రం
×