థ్యాంక్స్ ఫొటో : వావ్ తమన్నా హ్యాట్సాఫ్

మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవలే కరోనాను జయించిన విషయం తెల్సిందే. హైదరాబాద్ లో ఆమె కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో మొదటి రెండు రోజులు హోం క్వారెంటైన్ లో ఉన్నా స్వల్ప అనారోగ్య సమస్యలు రావడంతో కాంటినెంటల్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యిందట. దాదాపు పది రోజుల పాటు తమన్నా ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఇటీవలే ఆమె డిశ్చార్జ్ అయ్యింది. డిశ్చార్జ్ అయిన ఒకటి రెండు రోజులకే ముంబయి వెళ్లి పోయింది. అక్కడ ప్రస్తుతం కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేస్తూ విశ్రాంతి తీసుకుంటున్న తమన్నా ట్విట్టర్ లో ఈ ఫొటోను షేర్ చేసింది.

వీరికి థ్యాంక్స్ చెప్పేందుకు మాటలు సరిపోవు. కాంటినెంటల్ డాక్టర్లు.. నర్స్ మరియు ఇతర స్టాఫ్ అంతా కూడా నాకు ఎంతో మద్దతుగా నిలిచారు. తాను కరోనా జయించడంలో వారి సహకారం ఎప్పటికి మర్చిపోలేను అంటూ ఎమోషనల్ అయ్యింది. నేను బలహీనంగా ఉన్న సమయంలో భయపడుతున్న సమయంలో నాలో ఆత్మవిశ్వాసం నింపడంతో పాటు నాకు వీలును బట్టి నన్ను ట్రీట్ చేశారు. వారి దయా గుణం మరియు శ్రద్ద తీసుకునే తీరు వల్లే నేను చాలా స్పీడ్ గా రికవరీ అయ్యానంటూ కృతజ్ఞతలు చెప్పింది.

ఆసుపత్రిలో ఎంతో మంది కరోనాకు చికిత్స పొందారు. కాని ఇలా వైధ్యులకు కృతజ్ఞతలు చెప్పడం నిజంగా తమన్నా మంచి మనసు అంటున్నారు. తన ఆరోగ్యం విషయంలో శ్రద్ద తీసుకున్న వారిని ఆరోగ్యం బాగు అయిన తర్వాత కూడా గుర్తు పెట్టుకుని ఇలా ట్వీట్ చేయడం అభినందనీయం. నిజంగా హ్యాట్సాఫ్ తమన్నా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పొందిన సాయంను మరవకుండా ఇలా కృతజ్ఞతలు కొందరు మాత్రమే చెబుతారు.. తమన్నా కృతజ్ఞతలు చెప్పి అందరి దృష్టిని ఆకర్షించింది.
× RELATED RRR వివాదం .. భీమ్ మనవడికి జక్కన్న ఆన్సర్ ఏదీ?
×