#రాధేశ్యామ్... పూజా ద్విపాత్రాభినయం కాదు కానీ..!

ప్రభాస్ నటిస్తున్న రొమాంటిక్ పిరియాడిక్ ఫిక్షనల్ లవ్స్టోరీ `రాధేశ్యామ్`. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ షూటింగ్ చేస్తున్నారు. ముందున్న పరిస్థితులకు భిన్నంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ప్రభాస్- పూజా హెగ్డే తమకు అనువైన పద్దతుల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్ కి సహకరిస్తున్నారు.  

అయితే లన్ లాక్ ప్రక్రియలో భాగంగా రెండవ దశ మార్గదర్శకాలని పాటిస్తూ సెట్స్ లో షూటింగ్స్ చేస్తున్నామని సామాజిక దూరం... మాస్కులు ధరించి హగ్గులు ఆలింగనాలకు దూరంగా షూట్ చేస్తున్నామని కానీ కెమెరా ముందుకు రాగానే మాస్కులు తొలగిస్తున్నామని పూజా హెగ్డే చెబుతోంది. పూజా హెగ్డే తన పుట్టిన రోజుని ఇటీవల ఇటలీలో యూనిట్ సభ్యుల మధ్య జరుపుకుంది. ఇదే రోజు పూజా హెగ్డే ఓ ఎమోషనల్ సీన్ లో నటించిందట.  

టైమ్ జోన్లలో వున్న తేడా వల్ల టీమ్ కు 6 గంటల సమయం దొరుకుతోందని తెలిపింది. తాజా సమాచారం ప్రకారం ఇటలీలో కీలక ఘట్టాలని పూర్తి చేసి బ్యాలెన్స్ డ్ గా వున్న షూట్ ని హైదరాబాద్ లో పూర్తి చేయబోతున్నారట. అయితే అంతా ఊహిస్తున్నట్టు ఈ చిత్రంలో పూజా హెగ్డే తను డబుల్ రోల్ చేయడం లేదని స్పష్టం చేసింది. అంతే కాకుండా తనది పౌరాణికి పాత్ర కూడా కాదని వెల్లడించింది. ద్విపాత్రాభినయం కాకపోయినా పూజా హెగ్డే లుక్ వైజ్ వేరియేషన్స్ ఆద్యంతం మైమరిపిస్తాయిట. ముఖ్యంగా కాస్ట్యూమ్స్ సంథింగ్ స్పెషల్ లుక్ తో కట్టిపడేస్తాయిట.
× RELATED పవన్ కళ్యాణ్ రెండు పడవల మీద ప్రయాణం కొనసాగిస్తారా...?
×