హేమంత్ హత్య : నిందుతులని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసుల పిటిషన్ !

ప్రేమ పెళ్లి చేసుకున్న హేమంత్ అనే యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. కూతురిని ప్రేమించడానికి హేమంత్ పై పగ పెంచుకొని కిరాయి దాదా లకి సుపారీ ఇచ్చి అత్యంత కిరాతకంగా హత్య చేయించారు. ఆధునికంగా ఇంత అభివృద్ధి చెందుతున్న ఈ సమాజంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. కూతురి ప్రేమ పెళ్లి చేసుకోవడాన్ని సహించలేని తండ్రి ... గత వారం  గురువారం హేమంత్ ను కొందరు వ్యక్తులతో కిడ్నాప్ చేయించాడు. తర్వాత సంగారెడ్డిలో హేమంత్ ను దారుణంగా చంపేశారు. హేమంత్ ను కిడ్నాప్ చేసే సమయంలో అక్కడి నుంచి తప్పించుకున్న అవంతి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంగారెడ్డి జిల్లా కిష్టాయిగూడెంలో సమీపంలోని చెట్లలో హేమంత్ మృతదేహాన్ని కనుగొన్నారు.ఈహత్య కేసుకు సంబంధించి 13 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. యువతి తండ్రి లక్ష్మారెడ్డి బంధువులే ప్రధాన పోషించారని తెలిపారు.  తమకు సమాచారం వచ్చినవెంటనే స్పందించామని స్పష్టం చేశారు.

అయితే తాజాగా ఈ  హత్య కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విచారణలో భాగంగా నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ ఆ పిటిషన్ లో పొందుపరిచారు. హేమంత్ కుమార్ హత్య కేసులో నిందితులకు శిక్ష పడేందుకు కావాల్సిన పూర్తి సమాచారంతో పాటు శాస్త్రీయ ఆధారాలు సేకరించేందుకు విచారించాల్సిన అవసరముందని కస్టడీ పిటిషన్ లో కోరారు. ఇదిలా ఉండగా కుటుంబసభ్యులైన అశిష్రెడ్డి సందీప్ రెడ్డి వల్ల కూడా తమ కుటుంబానికి ప్రాణహని ఉందని హేమంత్ కుమార్ భార్య అవంతిరెడ్డి ఆరోపణలు చేస్తుంది. మామయ్య మురళీ కృష్ణకు సందీప్రెడ్డి ఫోన్కాల్ చేసి ఇంతకుముందు బెదిరించాడని తెలిపారు. వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు
× RELATED బండి సంజయ్ అరెస్ట్.. సిద్ధిపేటలో టెన్షన్ టెన్షన్
×