గోదా‘వర్రి’ కరోనాతో వణికిపోతున్న తీరప్రాంతం

నిత్యం పంటలతో సుభిక్షంగా కళకళలాడే గోదావరి తీరప్రాంతం. ప్రస్తుతం కరోనా మహమ్మారి దాటికి విలవిలలాడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ రెండు జిల్లాల్లో కరోనా చాలా తీవ్రంగా ఉంది. ప్రజలు అడుగు బయటపెట్టాలంటే వణికిపోతున్నారు. ప్రభుత్వం టెస్టులు చేస్తూ.. వైద్యం అందిస్తున్నప్పటికీ కరోనా ఏ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు అంతకంతా కేసులు పెరుగుతునే ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో పరిస్థితి చేయిదాటిపోయింది. గత రెండునెలలుగా ఈ జిల్లాలో కేసులు వెయ్యికి పైనే నమోదవుతున్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో అత్యధిక కేసులు (87769) ఈ జిల్లాలోనే నమోదు కావడం గమనార్హం. పశ్చిమ గోదావరిలో ఇప్పటివరకు 58 వేల కేసులు నమోదయ్యాయి.

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు లక్ష మార్కు దిశగా పరుగులు పెడుతున్నది. సోమవారం జిల్లాలో మరో 1262 మందికి వైరస్ సోకడంతో మొత్తం కేసుల సంఖ్య 87769కి పెరిగింది. కరోనాతో మరో నలుగురు మృతి చెందగా.. మొత్తం మరణాలు సంఖ్య 489కి చేరుకున్నది.

కరోనాతో సచివాలయ ఉద్యోగి బలి
ఏపీ సచివాలయంలో కరోనా మహమ్మారికి మరో ఉద్యోగి బలయ్యారు. ఇప్పటికే ఓ ఉద్యోగి మరణించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సచివాలయం ఐదోబ్లాక్లోని వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న సెక్షన్ అధికారి (ఎస్వో)కి ఇటీవల కరోనా సోకింది. అయితే ఆయన గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో వైపు గతంలోనాలుగో బ్లాకులో పశుసంవర్థక శాఖకు చెందిన సెక్షన్ అధికారి కూడా కరోనాతో మృతి చెందారు. ఇప్పటివరకు ఏపీ సచివాలయంలో 157 కేసులు నమోదయ్యాయి. కాగా సచివాలయంలో రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
× RELATED గేల్ వీర విధ్వంసం.. పంజాబ్ గ్రాండ్ విక్టరీ
×