అయోడిన్ ద్రావణంతో కరోనా ఖతం!

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం విలవిలలాడుతోంది. అయితే కరోనా వైరస్ను అంతమొందించేందుకు వ్యాక్సిన్ ఔషధాలు కనుక్కోనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలందరూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో కనెక్టికట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ యూనివర్శిటీ సైంటిస్టులు చేసిన ఓ ప్రయోగం సత్ఫలితాలు ఇచ్చింది. మామూలుగా గాయాలకు మందుగా రాసే అయోడిన్ ద్రావణం కరోనాను అంతమొందిస్తున్నదని వాళ్ల ప్రయోగాల్లో తేలింది. వాళ్లు చేసిన ఈ పరిశోధన ఆశలు రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేకదేశాలు కరోనా మహమ్మారితో విలవిలలాడుతున్నాయి. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. మనదేశంలో కూడా రోజూ 90 వేల కొత్తకేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే 87 వేలమంది చనిపోయారు. కేసుల నమోదులో ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరుకున్నాం.

పరిశోధన ఎలా సాగిందంటే..
శాస్త్రవేత్తలు కరోనా వైరస్ను చంపేందుకు మూడు మోతాదుల్లో ఈ ఔషధాన్ని ప్రయోగించారు. మొదటిది 0.5 శాతం రెండోది 1.25 శాతం మూడోది 2.5 శాతం. మూడు ప్రయోగాల్లోనూ అయోడిన్ ద్రావణాన్ని వాడిన 15 సెకండ్లలో కరోనా వైరస్ క్రియారహితంగా మారింది. ఈ పరిశోధనలపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే.. ‘నిజానికి అయోడిన్ ద్రావణం కరోనాను చంపేయడంతో కీలకపాత్రను పోషిస్తోంది.

ఈ ద్రావణంతో కరోనా వైరస్ చనిపోవడాన్ని మేము గమనించాము. అయోడిన్ ద్రావణం తీసుకున్న పేషెంట్లు కరోనా వ్యాప్తిని తక్కువగా చేస్తారు. దీనివల్ల కరోనా వ్యాప్తిని మనం అరికట్టవచ్చు’ అని శాస్త్రవేత్తలు చెప్పారు. మరోవైపు ఈ కొత్త పరిశోధనన వివరాలను (జామా) ఓటోలారింగోలజీ హడ్ అండ్ నెక్ సర్జరీలో పొందుపరిచారు. అయితే సైంటిస్టులు అయోడిన్ స్థానంలో ఇథనాల్ ఆల్కహాల్ ద్రావణాన్ని ప్రయోగించి చూడగా అది ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అయోడిన్ ద్రావణం కరోనాతోపాటు సార్స్ మెర్స్లాంటి వైరస్లను కూడా చంపనుందని ఈ పరిశోధనల్లో వెల్లడైంది. ఏది ఏమైనప్పటికీ కరోనా వైరస్పై అయోడిన్ ద్రావణం పనిచేయడం శుభపరిణామమే.
× RELATED కిడ్నాపర్ కోసం రైలునే ఆపలేదు!
×