డ్రగ్స్ మాఫియా: లవర్ అజీజ్ మాయ.. సంజన మతం మార్చుకుందా?

శాండిల్ వుడ్ లో బయటపడ్డ డ్రగ్స్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్ సంజనా గల్రాని తన లవర్ అజీజ్ ప్రోద్బలంతో లవ్ జీహాద్ లో భాగంగా మతం మార్చుకుందని తాజాగా సంచలన ఆరోపణలు చేశారు ప్రముఖ ఆర్టీఐ కార్యకర్త ప్రశాంత్ సంబర్గి. లవ్ జీహాద్ దెబ్బతో సంజన మతం మార్చుకొని ‘మహిరా’ గా పేరు మార్చుకుందని ఆయన ఆరోపించడం కలకలం రేపింది.

ప్రముఖ ఆర్టీఐ కార్యకర్త వ్యాపారవేత్త అయిన ప్రశాంత్ సంబర్గి మొదటి నుంచి సంజనపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. 2018లో నటి సంజన హిందూ మతం మారిపోయారని ప్రశాంత్ ఆరోపించారు. 2018లోనే ఆమె ఇస్లాం మతం స్వీకరించి ‘మహిరా’గా పేరు మార్చుకుందని అన్నారు. ఈ మేరకు తాజాగా ఫేస్ బుక్ లో పోస్టు చేయడం కలకలం రేపింది.

అయితే బెంగళూరు పోలీసులు మాత్రం సంజనను విచారించి ఆమెపై చార్జ్ షీట్ తయారు చేసి కోర్టులో సమర్పించారు. ఆమె పేరును ఎఫ్ఐఆర్ చార్జిషీట్ లో సంజనా గల్రానిగా నమోదు చేశారు. మహిరా అనే పేరు ఎక్కడా కనిపించలేదని సమాచారం.

హీరోయిస్ సంజన.. ప్రముఖ వైద్యుడు అజీజ్ అనేక సంవత్సరాలుగా ప్రేమించుకున్నారని శాండిల్ వుడ్ లో కోడై కూస్తున్నారు. ఇప్పటికే వారి నిశ్చిత్తారం ఫొటోలు అంటూ కొన్ని బయటకు వచ్చాయి. ఆమె ‘మహిరా’ పేరు మార్చుకుందని అంటున్నారు.కరోనా లాక్ డౌన్ తో పెళ్లి ఆగిపోయిందంటున్నారు. అయితే ఈ ఆరోపణలపై అటు సంజన కానీ.. ఇటు డాక్టర్ అజీజ్ కానీ అధికారికంగా స్పందించలేదు.
× RELATED ప్రముఖ నటుడి విడాకులపై అతడి అత్త క్లారిటీ?
×