శక్తివంతమైన స్టార్ భార్యలు ఏంటీ భారీ ప్రయోగం?

సెలబ్రిటీలు ఏం చేసినా కామన్ జనాల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. మంచి పనులు చేసినా.. సామాజిక సేవ.. అవేర్ నెస్ కి సంబంధించినవి ఏది చేస్తున్నా.. వారిని అనుసరించేందుకు అభిమానులతో పాటు కామన్ జనం ఆసక్తిని కనబరుస్తారు. అందుకే స్టార్ వైఫ్స్ ని మోస్ట్ పవర్ ఫుల్ అని సంభోధిస్తారు. సెలబ్రిటీల్ని కామన్ జనం రోల్ మోడల్స్ గా భావించడం వల్ల వారి బాధ్యత కూడా చాలా పెద్దది.

ఇక ఈ తరహా సామాజిక బాధ్యతలో సామాజిక సేవల్లో ఎంతో గొప్ప మనసున్న మాహారాణులుగా పాపులరయ్యారు సమంత అక్కినేని.. ఉపాసన కొణిదెల. ఆ ఇద్దరూ నిరంతరం సామాజిక సేవల్లో బిజీగా గడిపేస్తూనే కష్టనష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపు రకరకలా బిజినెస్ వ్యాపకాలు సహా నటన పరంగా బిజీగా ఉన్నా అక్కినేని కోడలు సమంత మాత్రం ప్రత్యూష సామాజిక సంస్థ ద్వారా రకరకాల సేవలు చేస్తూనే ఉన్నారు. అంగ వైకల్యం ఉన్నవారు.. పేద ఆడపిల్లలకు సహాయం చేస్తూనే ఉన్నారు.

మరోవైపు అపోలో హెల్త్ ఆర్గనైజర్ గా మ్యాగజైన్ ఎడిటర్ గా ఉపాసన సేవల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇక సోషల్ మీడియాలోనూ ఉపాసన రామ్ చరణ్ బోలెడన్ని అవేర్ నెస్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ ఇద్దరూ ఇకపై ఓ వెబ్ సైట్ వేదికగా మరిన్ని మంచి పనులకు శ్రీకారం చుడుతుండడం ఆసక్తికరం.

``సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే అత్యంత దయగల శక్తివంతమైన స్టార్ భార్యలు అద్భుతాల కోసం వస్తున్నారు. వేచి ఉండండి! @ Urlife.co.in ను అనుసరించండి`` అంటూ సోషల్ మీడియాల్లో ఓ మెసేజ్ సంచలనంగా మారింది. ఇక సమంత- ఉపాసన జోడీ ఈ వేదిక ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతోందో వెబ్ సైట్ పరిశీలిస్తే అర్థమవుతోంది. మంచికి మేము సైతం అంటూ బరిలో దిగితే.. వెల్ కం! అనేస్తున్నారు అభిమానులు.
× RELATED ప్రముఖ నటుడి విడాకులపై అతడి అత్త క్లారిటీ?
×