వైసీపీ ఎమ్మెల్యేపై కేసు పెట్టాలని హైకోర్టు ఆదేశం

ఏపీ హైకోర్టు ఆదేశాలతో ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కేసులు పెట్టాలని హైకోర్టు ఆదేశించడం సంచలనమైంది. వైసీపీ ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులు 12మందిపై ద్వారకా తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు.

పశ్చిమ గోదావరి జల్లా గోపాలపురం పోలీసులు తలారి వెంకట్రావ్ పై కేసు నమోదైంది. ఏపీ హైకోర్టు ఆదేశాలతో ఆయనపై ఐపీసీ 448 506 సెక్షన్ల కింద ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులు 12మందిపై ద్వారకా తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు.

2017 డిసెంబర్ లో తలారి వెంకట్రావు తన అనుచరులతో కలిసి తన ఇంటిపై దాడికి పాల్పడ్డారని మాలసానికుంటకు చెందిన ఆదిలక్ష్మీ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు అప్పుడు కేసు నమోదు చేయలేదు.

దీంతో సదురు మహిళ ఈ దాడి వ్యవహారంలో పోలీసులు పట్టించుకోలేదని.. తనకు న్యాయం చేయాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

ఆదిలక్ష్మీ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఎమ్మెల్యే వెంకట్రావ్ తోపాటు మరో 12మందిపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. దీంతో వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు వ్యవహారంపై ఎమ్మెల్యే స్పందించాల్సి ఉంది.
× RELATED గేల్ వీర విధ్వంసం.. పంజాబ్ గ్రాండ్ విక్టరీ
×