బ్యాచిలర్ సంక్రాంతి బరిలో రాలేకపోయినా..!

అఖిల్ అక్కినేని `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చిత్రీకరణ ఈ నాలుగైదు నెలల క్రైసిస్ వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవల తిరిగి ప్రారంభమైంది. నవంబర్ నాటికి షూటింగ్ పూర్తవుతుందని ఓ అంచనా. శరవేగంగా నిర్మాణానంతర పనులు పూర్తి చేసి 2021 సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయనున్నామని జీఏ2 ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఇంతకుముందు ప్రకటించింది.

తాజాగా రిలీజ్ తేదీని చిత్ర కథానాయకుడు అఖిల్ కన్ఫామ్ చేశారు. తాజాగా అఖిల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2021 సంక్రాంతికి విడుదల చేయలేకపోయినా.. జనవరి 22న రిలీజ్ ఖాయమేనని వెల్లడించారు. అక్కినేని అభిమానులకు కొంత గ్యాప్ తర్వాత అదిరిపోయే ట్రీట్ ఉంటుందని తెలిపాడు.

అయితే ఈ మూవీని సంక్రాంతి బరిలో రిలీజ్ చేయడం అంటే సాహసమే. అప్పుడు వరుసగా పలు క్రేజీ చిత్రాలు రిలీజ్ క్యూలో ఉన్నాయి. వాటితో పోటీపడి కలెక్షన్లు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటినీ మించి మరో రెండు మూడు నెలల్లో వైరస్ మహమ్మారీ శాంతించకపోతే పరిస్థితి ఆగమ్యగోచరం అవుతుందన్న ఆందోళన ఉంది.

ఇక ఈ క్రేజీ మూవీకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రీకరణ పూర్తి చేసుకుని అఖిల్ తదుపరి మరో భారీ మాస్ యాక్షన్ సినిమా కోసం ప్రిపేరవ్వాల్సి ఉంటుంది. ఆ చిత్రానికి రేసుగుర్రం ఫేం సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించే వీలుందని ప్రచారమవుతోంది.
× RELATED హీరో కూతురిని రేప్ చేస్తానని.. ఇప్పుడేమో సింపుల్ గా సారీ అనేశాడు!
×