ష్...! సైలెంటుగా కాకులు దూరని కారడవిలోకి జక్కన్న!!

వరుసగా ఒక్కొక్కరుగా షూటింగుల కోసం బరిలో దిగుతున్నారు. కోవిడ్ విలయం కొనసాగుతున్నా దానికి భయపడక అన్ని జాగ్రత్తలతో షూటింగులు చేసేస్తున్నారు. ఇకపై ఆర్.ఆర్.ఆర్ కి టైమ్ వచ్చింది. త్వరలో సెట్స్ కి వెళ్లాల్సి ఉంది. ఆ క్రమంలోనే జక్కన్న తదుపరి షెడ్యూల్ కోసం లొకేషన్ల వేట సాగిస్తున్నారని గుసగుసలు వేడెక్కిస్తున్నాయి.

దానికి తగ్గట్టే భార్యా సమేతుడై ఎస్.ఎస్.రాజమౌళి గత రెండు రోజులుగా మైసూర్.. కొడగు ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అక్కడ స్థానిక ప్రజలు బాహుబలి దర్శకుడిని ఆయన వైఫ్ రమాను గుర్తించేయడమే గాక ఎంతో ఎగ్జయిట్ మెంట్ తో ఫోటోలు తీసి సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తుండడంతో ఆ రహస్యం కాస్తా బయటి ప్రపంచానికి రివీలైంది.

వాస్తవానికి రాజమౌళి- రమ దంపతులు పర్యటిస్తున్న బండిపూర్ నేషనల్ రిజర్వ్ ఫారెస్ట్ ని చాలా సెన్సిటివ్ జోన్ గా భావిస్తారు. ఇది కాకులు దూరని కారడవి. నిషిద్ధ ప్రాంతం. ఈ రిజర్వ్ ఫారెస్ట్ లో సినిమా షూటింగ్ కు అనుమతి లేదు. అయితే నెలరోజుల్లో ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ కోసం రెడీ అవుతుండగా ఈ విజిట్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది లొకేషన్ల వేటేనా?  లేక మామూలు టూర్ అనుకోవాలా? అన్న చర్చా సాగుతోంది. సాధ్యమైనంత తొందరగా ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ ముగించేందుకు చరణ్ .. తారక్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. తదుపరి ప్రాజెక్టులు పెండింగులో ఉన్నందున జక్కన్న నుంచి క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
× RELATED పవన్ కళ్యాణ్ రెండు పడవల మీద ప్రయాణం కొనసాగిస్తారా...?
×