20 ఏళ్ల నాటి సీన్ రిపీట్.. అమెరికా ఎన్నికల ఫలితాలు ఆలస్యం

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొనే అమెరికాలో ఈ సారి ఎన్నికల ఫలితాలు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉన్నదా? ఏప్పుడో 20 ఏళ్ల క్రితం అల్బెర్ట్ గోర్ జార్జి డబ్ల్యూ బుష్ అధ్యక్ష ఎన్నికల్లో తలపడ్డప్పుడు ఎన్నికలు జరిగిన 36 ఏళ్లకు  ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు కూడా అప్పటి సీన్ రిపీట్ కాబోతున్నదా? అంటే అమెరికాకు చెందిన మీడియా నుంచి అవుననే సమాధానమే వస్తోంది.  అమెరికా అధ్యక్ష ఎన్నికలు వాటి ఫలితాలంటే యావత్ ప్రపంచానికి ఆసక్తి నెలకొని ఉంటుంది. అయితే ప్రస్తుతం  ఫలితాలు ఆలస్యం ఆయ్యే అవకాశం ఉందని పలువురు విశ్లేషకు లు భావిస్తున్నారు. అందుకు గల కారణాలు ఏమిటో తెలుసుకొనే ప్రయత్నం చేదాం..  కరోనా మహమ్మారి  విలయతాండవం చేస్తున్న ప్రస్తుత తరుణం లో ప్రజలు ఓటింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసే పరిస్థితి లేదు.  చాలా మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లేస్తారు కాబట్టి.. ఈ ఓట్లను లెక్కించేందుకు చాలా టైం పడుతుంది. అందువల్ల ఫలితాల విడుదల ఆలస్యం తప్పదు.  గతం లో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 8 కోట్ల మంది ప్రజలు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు వేస్తారని అక్కడి అధికారులు భావిస్తున్నారు.

పోస్టల్ బ్యాలెట్ లో ఆలస్యంగా ఎందుకు

పోస్టల్ బ్యాలెట్ ద్వారా వేసిన ఓట్లను లెక్కించేందుకు చాలా ప్రక్రియ ఉంటుంది. చాలా దశల్లో  ఈ ప్రక్రియ పూర్తవుతుంది. తొలుత ఎన్నికల అధికారులు బ్యాలెట్ పత్రాలను ఓటర్లకు పంపాలి. తర్వాత వారు తమ ఓట్లను తిరిగి ఎన్నికల అధికారులకు నిర్ణీత గడువులోగా పంపించాల్సి ఉంటుంది. అలా గడువు లోగా పంపించే ఓట్లు మాత్రమే చెల్లు బాటు అవుతాయి.

రాష్ట్రాలే కీలకం
ఎన్నికల ప్రక్రియలో రాష్ట్రాలు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే ఈ విధానం ఓక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది. పోస్టల్ ద్వారా పంపిన ఓటుకు అర్హత నిర్ణయించే అధికారం ఆయా రాష్ట్రాలకు మాత్రమే ఉంటుంది. ఓటర్లను లెక్కించే విధానం ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా ఉంటుంది. పెన్సిల్వేనియా రాష్ట్రం ఎన్నికల రోజున 8 గంటల వరకు తమకు చేరిన ఓట్లను మాత్రమే లెక్కిస్తుంది. అదే  కాలిఫోర్నియా అయితే ఎన్నికలు జరిగిన వారానికి పోస్టల్ వచ్చినా లెక్కిస్తుంది. ఎన్నికల ప్రక్రియ ఆలస్యం కావడానికి ఇదో కారణం. తప్పుడు ఓట్లు పోల్ కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. పోస్ట్ కార్డు ద్వారా ఓటేసిన వ్యక్తి సంతకం పెట్టాల్సి ఉంటుంది.. ఈ సంతకం  అతడు గుర్తింపు కార్డు పైన పెట్టిన సంతకాన్ని పోలి ఉండాలి. లేదంటే ఓటు చెల్లకుండా పోతుంది. ఇన్ని జాగ్రత్తల మధ్య ఈ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి.. కనుక ఆలస్యం కావడం తప్పదని అధికారులు చెబుతున్నారు.
× RELATED ట్రాక్టర్ నడుపుతూ తడబడ్డ లోకేశ్.. డ్రెయిన్లోకి వాహనం.. కేసు నమోదు
×