ముగ్గురు ఇగోయిస్టుల కలయికలో వస్తున్న ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో...!

తెలుగు సూపర్ హిట్ సినిమా పేరుని ఇంటి పేరుగా మార్చుకున్న ఓ హీరో చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ టాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. ఒకప్పుడు తెలుగులో సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన ఆ హీరో ఆ తర్వాత చేసిన తెలుగు సినిమాలేవీ ఆ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. చివరగా తెలుగులో స్టార్ హీరో సినిమాలో గెస్ట్ రోల్ చేసిన సదరు హీరో.. ఓ అనువాద చిత్రంతో పలకరించాడు. అయితే ఏడేళ్లుగా స్ట్రయిట్ తెలుగు సినిమాలో మాత్రం నటించలేదు. నిజానికి ఈ హీరో టాలీవుడ్ లో ఫుల్ ఫార్మ్ లో ఉన్నప్పుడు ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటించి ప్లాప్ ని మూటగట్టుకున్నాడు. అయితే ఆ సినిమాకి నెగెటివ్ రెస్పాన్స్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులపైనా విమర్శకులపైనా కామెంట్స్ చేసి ఇక్కడి వారి ఆగ్రహానికి గురయ్యాడు. ఓ సందర్భంలో ఇక్కడి వారికి సినిమా చూడటం రాదని కామెంట్ చేసి ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఆ హీరో అలాంటి వ్యాఖ్యలు చేయకపోయుంటే ఇప్పటికే తెలుగులో ఓ స్టార్ హీరో రేంజ్ లో ఉండేవాడని చెప్పవచ్చు. అయితే ఇన్నేళ్ల తర్వాత ఓ మల్టీస్టారర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మెప్పు కోసం ప్రయత్నిస్తున్నాడు.

కాగా తెలుగులో సెన్సేషనల్ హిట్ అందుకున్న డైరెక్టర్ ఒకరు రెండుళ్లుగా ఓ మల్టీస్టారర్ స్క్రిప్ట్ మీద వర్క్ చేసి చివరికి ఇద్దరి హీరోలను ఫైనలైజ్ చేసుకున్నాడు. అందులోనూ బ్లాక్ బస్టర్ సినిమా తీసి లాభాల్లో ఉన్న ఓ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్ ని భారీ బడ్జెట్ తో నిర్మించడానికి ముందుకొచ్చింది. ముందుగా టాలీవుడ్ లో హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూకుడు చూపిస్తున్న ఓ యువ హీరోని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక చాలా ఏళ్లుగా టాలీవుడ్ కు దూరంగా ఉన్న మరో హీరోని కూడా తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ రిజల్ట్ ఎలా ఉండబోతుందో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కెరీర్ స్టార్టింగ్ నుండి ఏంటో కష్టపడి తనకంటూ సెపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకున్న యువ హీరో పర్మామెన్స్ పరంగా కూడా సీనియర్ హీరో కంటే కాస్త ముందజంలోనే ఉంటాడు. అందుకే ఇప్పుడు వేరే హీరో తో సింక్ అవుతాడో లేదో అనే డౌట్. మరోవైపు చాలా ఏళ్ళ తర్వాత ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న వ్యవహారశైలి ఏంటో అందరికీ తెలుసు. అందుకే ఈ ఇద్దరు హీరోలను చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే వీరిద్దరితో పాటు డైరెక్టర్ కూడా మరో హీరోగా ఫీల్ అవుతుంటాడని ఇండస్ట్రీలో టాక్ ఉంది. మరి ఈ ముగ్గురి కలయికలో రాబోతున్న ఈ సినిమా రిజల్ట్ ఎలా వస్తుందో చూడాలి.
× RELATED అభిమానులను నిరాశపర్చిన అసిన్
×