స్టార్ హీరో పేరుతో కూడా మోసం చేస్తున్నారట!

ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో ప్రముఖుల పేర్లు ఉపయోగించి డబ్బులు సంపాదించుకోవడం ప్యాషన్ అయ్యింది. సెలబ్రెటీలతో ఉన్న చిన్నపాటి పరిచయం వారితో ఏదైనా సమయంలో తీసుకున్న ఫొటోగ్రాఫ్ ను ఉపయోగించుకుని చాలా మంది డబ్బులు దండుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల సింగర్ సునీత మేనల్లుడిని అంటూ ఒక వ్యక్తి చీటింగ్ కు పాల్పడ్డాడు. ఆ తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్ పేరుతో ఆడిషన్స్ నిర్వహించి డబ్బులు దండుకోవడం హారిక హాసిని బ్యానర్ ల ను కూడా వాడుకునేందుకు కొందరు కేటుగాళ్లు ప్రయత్నించారు. తాజాగా తమిళ స్టార్ హీరో అజిత్ పేరును కూడా వాడి  అతడికి సంబంధించిన వ్యవహారాలను చక్క బెట్టే ప్రయత్నాలు చేశారు.

తమిళ మీడియా మరియు పోలీసుల కథనం ప్రకారం.. అజిత్ కు ఆప్తులం మరియు సన్నిహితులం. అతడి బిజినెస్ వ్యవహారాలు అన్ని కూడా మేమే చూస్తాం. ఆయన వ్యాపారం విస్తరించేందుకు నిధులు సేకరించే బాధ్యత మాకు అప్పగించాడు. అంటూ చాలా మంది వద్ద నిధులు సేకరించారట. ఈ విషయం తమిళ మీడియాలో ప్రముఖంగా ప్రచారం జరుగుతోంది. తన పేరుతో డబ్బు వసూళ్లు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో వెంటనే అజిత్ అప్రమత్తం అయ్యారు.

పోలీసులకు వారిపై ఫిర్యాదు చేశాడట. తన పేరునుతో డబ్బు వసూళ్లు చేయడంతో పాటు తన పేరు ఎక్కడ వాడుకున్నా కూడా వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అజిత్ సంబంధీకులం అంటూ ఎవరు వచ్చినా మాకు చెప్పండి అంటూ అజిత్ మేనేజర్ ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. కఠినంగా వారి పట్ల వ్యవహరించాలంటూ స్వయంగా అజిత్ పోలీసులకు విజ్ఞప్తి చేసినట్లుగా సమాచారం అందుతోంది.
× RELATED హీరో కూతురిని రేప్ చేస్తానని.. ఇప్పుడేమో సింపుల్ గా సారీ అనేశాడు!
×