అమ్మడి కెరీర్ మళ్ళీ అలా మొదలుకానుందా...?

''అలా మొదలైంది'' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది బబ్లీ బ్యూటీ నిత్యామీనన్. కెరీర్ ప్రారంభం నుంచి కూడా గ్లామర్ షోకు దూరంగా ఉంటూ కథకు ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో మాత్రమే నటిస్తూ వచ్చింది. 'ఇష్క్' 'గుండెజారి గలంతయ్యిందే' 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' 'సన్నాఫ్ సత్యమూర్తి' 'రుద్రమదేవి' '24' 'జనతా గ్యారేజ్' 'అ!' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఒకానొక దశలో స్టార్ హీరోయిన్ అనిపించుకున్న నిత్య.. ఈ మధ్య తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. 'గీత గోవిందం' 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాలలో గెస్ట్ రోల్స్ చేసిన నిత్యా మీనన్ కి .. ఆ తర్వాత మరో తెలుగు సినిమాలో నటించే అవకాశం రాలేదు.

ఈ క్రమంలో బాలీవుడ్ లో అడుగుపెట్టి 'మిషన్ మంగళయాన్' అనే సినిమాలో అక్షయ్ కుమార్ తో కలిసి నటించింది. దీంతో పాటు హిందీలో ''బ్రీత్ : ఇన్ టూ ది షాడోస్'' అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ లో సడన్ గా లిప్ లాక్ సీన్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. సక్సెస్ ఫుల్ 'బ్రీత్' సిరీస్ కి సెకండ్ సీజన్ గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ ని ఓటీటీ ఆడియన్స్ నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. దీంతో బాలీవుడ్ లో సత్తా చాటాలనుకున్న నిత్యకు నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నిత్యకు ఇప్పుడు అన్ని భాషల్లో అవకాశాలు సన్నగిల్లాయని తెలుస్తోంది.

ఇలాంటి సమయంలో నిత్యా మీనన్ మరోసారి లక్ టెస్ట్ చేసుకోవడానికి తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. శ్రియా శరణ్ ప్రధాన పాత్రలో వస్తున్న ''గమనం'' అనే రియల్ లైఫ్ డ్రామాలో నిత్యా శాస్త్రీయ సంగీత గాయని పాత్ర పోషిస్తోంది. తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ భాషల్లో పాన్ ఇండియా ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి సుజనా రావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్నారు. జ్ఞానశేఖర్ వి.ఎస్. - రమేష్ కరుటూరి - వెంకీ పుషడపు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తయిన 'గమనం' చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరి 'గమనం'తో నిత్య కెరీర్ మళ్ళీ అలా మొదలవుతుందో లేదో చూడాలి.

× RELATED మళ్లీ మద్యలోనే 'రాధేశ్యామ్' వెనక్కు రానున్నాడా?
×