అమెరికాలో వేప పుల్లలకు 15 డాలర్లంట!

పల్లెటూళ్లో పుట్టి పెరిగిన వారందరూ అప్పుడో ఇప్పుడో ఒక్కసారైనా వేప పుల్లలతో పళ్లు తోముకొని ఉంటారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా వేప పుల్లలు విరివిగా ఉంటాయి. వాటిని తెంపుకొని నోట్లో వేసుకోవడమే ఆలస్యం. ఎలాంటి కండీషన్లు నిబంధనలు ఉండవు..

కానీ అమెరికాలో ఇదో విచిత్రం. వేప పుల్లలకు డిమాండ్ వచ్చింది. వేప పుల్లలను అమెరికా సూపర్ మార్కెట్లలో 15 డాలర్లకు అమ్ముతున్నారు. ఈ మేరకు సియట్ కంపెనీ చైర్మన్ హర్ష గోయెంకా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

మన పల్లెల్లో విరివిగా ఫ్రీగా లభించే వేప పుల్లలను అమెరికాలో ఏకంగా 15 డాలర్లు అంటే దాదాపు 1000 రూపాయలకు అమ్ముతున్నారంటే విచిత్రమే మరి..

ఎప్పటి నుంచో మనం బొగ్గు ఉప్పు వేప పుల్లలతో దంతాలు శుభ్రం చేసుకునే వారమని.. ఇప్పుడు టూత్ పేస్ట్ ల మీద పడ్డామని.. పాత అలవాట్లే ఇప్పుడు కరోనా టైంలో అందరూ పాటిస్తున్నారని.. అందుకే పాత అలవాట్లు మళ్లీ వచ్చాయంటున్నారు.
× RELATED గేల్ వీర విధ్వంసం.. పంజాబ్ గ్రాండ్ విక్టరీ
×