విజయ్ దేవరకొండలో మరో యాంగిల్ చూపిస్తాడట!

అర్జున్ రెడ్డి గీత గోవిందం చిత్రాలతో విజయ్ దేవరకొండ అందరికి దగ్గర అయ్యాడు. యూత్ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ప్రస్తుతం పూరి దర్శకత్వంలో ఈయన చేస్తున్న సినిమా కూడా స్టైలిష్ లుక్ తో కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు చేసిన సినిమాలకు ఇది విభిన్నంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. పూరి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ చేయబోతున్న సినిమాకు శివ నిర్వాన దర్శకత్వం వహించబోతున్నాడు. నిన్ను కోరి మరియు మజిలీ చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ సక్సెస్ లను దక్కించుకున్న శివ నిర్వాన చాలా విభిన్నమైన కాన్సెప్ట్ తో విజయ్ దేవరకొండను చూపించబోతున్నాడట.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్న విజయ్ దేవరకొండ.. శివ నిర్వానల మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో పట్టాలెక్కబోతుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యిందని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరు చేస్తున్న సినిమాలు వచ్చే ఏడాది సమ్మర్ కు పూర్తి అయ్యే అవకాశం ఉంది. విజయ్ దేవరకొండను మరో యాంగిల్ లో చూపించేందుకు శివ నిర్వాన సిద్దం అయ్యాడట. ప్రయోగాత్మక సినిమాలను చేసేందుకు ఎప్పుడు సిద్దంగా ఉండే విజయ్ దేవరకొండ ఈ సినిమాతో మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం అనిపిస్తుంది. ప్రేక్షకులు వచ్చే ఏడాది విజయ్ దేవరకొండను కొత్తగా చూడటం ఖాయం అంటూ మైత్రి మూవీ మేకర్స్ వారు నమ్మకంగా చెబుతున్నారు.
× RELATED మళ్లీ మద్యలోనే 'రాధేశ్యామ్' వెనక్కు రానున్నాడా?
×