#అర్నాబ్ ప్రశ్న: ఇంత మాట్లాడే సల్మాన్ ఏడీ? ఎక్కడ దాక్కున్నాడు?

బాలీవుడ్ మాఫియా సినీపెద్దల విషయంలో ముంబై మీడియా రెండుగా విడిపోయిన సంగతి తెలిసిందే. అందులో రిపబ్లిక్ టీవీ సూటిగా బాలీవుడ్ స్టార్ల వ్యవహారికాలపై రెగ్యులర్ బేసిస్ లో కథనాలు వేయడం సంచలనమైంది. ఇక ఈ చానెల్లో కంగన రనౌత్ ఇంటర్వ్యూలు సంచలనం అయ్యాయి. అనలిస్ట్ కం ఎడిటర్ అర్నాబ్ గోస్వామి ఆసక్తికర ప్రశ్నలు వ్యంగ్యం వెటకారం ఓ రేంజులో కలకలం రేపుతున్నాయి.

ఆర్జీవీ లాంటి కొందరు అర్నాబ్ ని మీడియా ప్రాస్టిట్యూట్ అని తిట్టేస్తున్నా .. బయోపిక్ తీస్తామని హెచ్చరించినా అర్నాబ్ దేనికీ బెదిరిపోవడం లేదు. తన పని తాను చేసుకుపోతున్నాడు. తాజాగా అర్నాబ్ గోస్వామి సల్మాన్ ఖాన్ పై అసభ్యకరమైన పదాలు ఉపయోగిస్తూ మాట్లాడిన వీడియో వైరల్ అయ్యింది. ఇది వివాదాస్పద ఎపిసోడ్ కావడంతో దానిని సల్మాన్ అభిమానులు ఖండిస్తున్నారు. ‘రిపబ్లిక్ టీవీ-బిగ్ బాస్ క్రాస్ఓవర్ ఎపిసోడ్’ గా అభివర్ణిస్తున్నారు. సల్మాన్ ఖాన్ కి ‘పెద్ద అభిమానిని’ అని గోస్వామి తన గత వాదనలను ప్రస్థావిస్తున్నా.. ఇదంతా వంచన అంటూ ఫ్యాన్స్ వేలెత్తి చూపిస్తున్నారు.

రిపబ్లిక్ టీవీ వ్యవస్థాపకుడు అర్నాబ్ .. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై అసాధారణమైన కోపావేశాన్ని ప్రదర్శిస్తూ.. ``ఇంత మాట్లాడే సల్మాన్ ఎక్కడ? అతను ఎక్కడ దాక్కున్నాడు? డ్రగ్స్ మాఫియాకు వ్యతిరేకంగా అతను ఒక్కసారి అయినా గొంతు ఎందుకు పెంచడు?`` అంటూ ప్రశ్నల దాడి చేశాడు. నేను సల్మాన్ ఖాన్ పేరు పెడుతూ ఈ ప్రశ్న అడుగుతున్నాను. సల్మాన్ ఖాన్ మీరు ఎక్కడ ఉన్నారు? ఒక్క ప్రకటన లేదా ట్వీట్ కూడా లేదు. దిశా సాలియన్ మొత్తం ఎపిసోడ్ లో మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? సుశాంత్ (సింగ్ రాజ్ పుత్) హత్యపై మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? మీది ఏ నగరం? సల్మాన్ .. మీరు ఏ దేశంలో ఉన్నారు? బిగ్ బాస్ మీ కోసం ఇతరులు వ్రాసిన డైలాగ్స్ చదువుతారు. అంతేనా? అంటూ అర్నాబ్ అరిచినంత పనీ చేశారు.

ఆ రకంగా సల్మాన్ ని సుశాంత్ సింగ్ రాజ్పుత్ బలవన్మరణం కేసులోకి లాగడం ద్వారా గోస్వామి నెటిజనుల చీత్కారాల్ని ఎదుర్కొంటున్నారు. కొంతమంది అయితే వేరొక చానెల్ కోసం పనిచేసినప్పుడు గోస్వామితో సల్మాన్ పాత ఇంటర్వ్యూను తవ్వి తీశారు. ఆ ఇంటర్వ్యూలో గోస్వామి సల్మాన్ పట్ల విస్మయం వ్యక్తం చేశారు. తన పరిచయంలో “నాకు సల్మాన్ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు మీతో మాట్లాడిన ప్రతిసారీ సంపూర్ణ ఆనందం. నేను మీ అభిమానిని ” అంటూ అర్నాబ్ మాట్లాడడం కనిపిస్తోంది.

ఆ ఇంటర్వ్యూలో ‘అభిమాని’ గోస్వామి సల్మాన్ ఖాన్ పై ప్రశంసలు కురిపించారు. భాయ్ ను కాపీ చేయడానికి ఎంత మంది ప్రయత్నించారో అతను సల్మాన్ కు చెప్పాడు. కానీ దబాంగ్ నటుడిగా మీ విజయానికి ఎవరూ సరిపోలలేదు అంటూ పొగిడేశాడు అర్నాబ్. సల్మాన్ ఖాన్ కలర్స్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ కి చాలా సంవత్సరాలుగా హోస్టింగ్ చేస్తున్నాడు. కలర్స్ టీవీ ఇటీవల రియాలిటీ షో రాబోయే ఎడిషన్ వీడియోను ఆవిష్కరించిన సంగతి విధితమే. ఇలాంటి సమయంలో అర్నాబ్ కావాలనే సల్మాన్ తో పెట్టుకోవడం కలకలం రేపింది.
× RELATED హీరో కూతురిని రేప్ చేస్తానని.. ఇప్పుడేమో సింపుల్ గా సారీ అనేశాడు!
×