'ఆదిపురుష్' ని అందరికీ చూపిస్తారా...?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' అనే స్ట్రెయిట్ హిందీ చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. రామాయణం నేపథ్యంలో తెరకెక్కతున్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నారు. చెడుపై మంచి సాధించిన విజయం అనే థీమ్ తో రానున్న ఈ మూవీలో 'డార్లింగ్' ప్రభాస్ రాముడిగా.. సైఫ్ అలీఖాన్ రావణుడుగా కనిపించనున్నారు. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ భూషణ్ కుమార్ - క్రిషన్ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న 'ఆదిపురుష్' ని వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకి తీసుకెళ్లి 2022లో రిలీజ్ చేసే విధంగా ప్లాన్స్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా 3డీలో విజువల్ వండర్ లా ప్లాన్ చేస్తున్న ఈ ఇతిహాసగాథను ఏక కాలంలో తెలుగు హిందీ భాషల్లో రూపొందించి తమిళ మలయాళ కన్నడ భాషలలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా ప్రభాస్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని పలు విదేశీ భాషల్లోకి డబ్ చేయనున్నారు. అయితే రామాయణ ఇతిహాసం భారతదేశంలో అందరికి తెలిసిన గాథే కాబట్టి 'ఆదిపురుష్' చిత్రాన్ని అన్ని భాషల్లోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారట. ముందుగా ఐదు ప్రధాన భారతీయ భాషల్లో రిలీజ్ చేసి ఆ తర్వాత ఇతర భారతీయ భాషల్లోకి అనువదించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
× RELATED 'డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తన జిప్ తీసి.. నా సల్వార్ కమీజ్ నాడా లాగాడు'
×