దర్శక దిగ్గజం సింగీతంకు కరోనా

సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు వరుసగా కరోనా  బారిన పడుతున్నారు. కొంచెం వయసు ఎక్కువగా ఉన్న వాళ్లకు వైరస్ ప్రభావం మరీ అధికంగా ఉంది. ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు ముందుగా మైల్డ్  కరోనా సోకిన ప్పటికీ ఆ తర్వాత పరిస్థితి తీవ్రంగా విషమించింది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా దర్శక దిగ్గజం  సింగీతం శ్రీనివాసరావుకి కరోనా  వైరస్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ఇటీవల కొంచెం అనారోగ్యంగా ఉండటంతో కరోనా  పరీక్ష చేయించుకున్నానని..  పరీక్షల్లో పాజిటివ్ తేలిందని చెప్పారు.

'నేను ఇప్పుడేంటి అరవై డెబ్భై సంవత్సరాలుగా పాజిటివ్ నే ' అంటూ కరోనాను సైతం ఆయన తేలిగ్గా తీసుకున్నారు. వైద్యులు కరోనా సోకిందని చెప్పినప్పటినుంచి హోమ్  ఐసోలేషన్ లోనే ఉంటున్నానని ఈ నెల 23వ తేదీ వరకు ఐసోలేషన్ లోనే ఉంటానని చెప్పారు. దీని పై అభిమానులు  సన్నిహితులు ఎవరు కంగారు పడొద్దని తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని తొందర్లోనే పూర్తిగా కోలుకుంటానని సింగీతం శ్రీనివాసరావు తెలిపారు.

ప్రస్తుతం సింగీతం ఓ  స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ కథ సమంతా కోసం సిద్ధం చేస్తున్నారని ప్రచారంలో ఉంది. నందమూరి బాలకృష్ణ తో సింగీతం శ్రీనివాసరావు తీసిన ఆదిత్య 369 సినిమా ఎంత క్లాసికల్ హిట్  గా నిలిచిందో  అందరికీ తెలిసిందే. ఈ  సినిమాకు కూడా సీక్వెల్ తీసేందుకు సింగీతం ఎన్నో రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఇది ఎంతవరకు వస్తుందో చూడాలి మరి.
× RELATED 'డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తన జిప్ తీసి.. నా సల్వార్ కమీజ్ నాడా లాగాడు'
×