నేతలపై కేసులు.. ఇక జెట్ స్పీడు

ప్రజాప్రతినిధులపై నమోదయ్యే కేసులు సత్వరమే విచారించేలా కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ప్రతినిధులపై నమోదయ్యే కేసులను వేగంగా విచారించేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ ట్రయల్స్ కు కేంద్రం సానుకూలంగా ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం సుప్రీం కోర్టు ధర్మాసనానికి నివేదించింది.

నేతలపై కేసుల సత్వర విచారణ కోసం కాలవ్యవధిని నిర్ణయించవచ్చని.. ఈ విషయంలో సుప్రీం కోర్టు ధర్మాసనం తీసుకునే ఏ నిర్ణయానికైనా కేంద్రం సానుకూలంగా ఉందని తుషార్ మెహతా అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది.

2015లో సుప్రీం కోర్టు ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను ఏడాదిలోగా విచారణ పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్ల తర్వాత అంటే 2020 నాటికి కూడా అమలు కాకపోవడంపై దాఖలైన పిటీషన్ ను సుప్రీం కోర్టు విచారిస్తోంది.

ఈ విచారణలో భాగంగా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. సెప్టెంబర్ తొలివారంలో సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై స్పందించిన కేంద్రం ప్రజాప్రతినిధులపై నమోదయ్యే కేసులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు సుముఖత వ్యక్తం చేసింది. దీంతో ఈ విషయంలో సుప్రీం కోర్టు త్వరలోనే కీలక తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి.
× RELATED పాతబస్తీలో డ్రగ్స్ దందా.. ముఠా అరెస్ట్
×