వికాస్‌దూబే ఈజ్ బ్యాక్.. దయ్యమై వచ్చాడట.. బిక్రూలో పుకార్లు

ప్రస్తుత ఆధునిక కాలంలోనూ అక్కడక్కడా దయ్యాలు భూతాలు అంటూ హడావిడి జరగడం మనము చూస్తూనే ఉంటాం. రెండునెలల క్రితం ఉత్తర్‌ప్రదేశ్ కు  చెందిన గ్యాంగ్‌స్టర్ వికాస్‌దూబే పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కాగా ప్రస్తుతం వికాస్‌దూబే దయ్యమై వచ్చాడని.. అతడు స్వగ్రామం బిక్రులో పుకార్లు వ్యాపించాయి. ఇప్పడు బిక్రు గ్రామంలో ఎవరిని కదిలించినా ఈ విషయమే మాట్లాడుతున్నారు. వికాస్‌దూబేకు పోలీసులు సక్రమంగా అంత్యక్రియలు జరపలేదని.. దీంతో అతడు దయ్యమే తమ గ్రామంలోనే తిరుగుతున్నాడని గ్రామస్థులు చెబుతున్నారు. రాత్రి సమయంలో తమ గ్రామంలో చాలా చోట్ల తుపాకి పేలిన శబ్ధాలు వినిపిస్తున్నాయని గ్రామస్థులు చెప్పడం గమనార్హం..  దీంతో గ్రామస్థులు సూర్యాస్తమయం అయిన వెంటనే తలుపులకు గడియపెడుతున్నారు.

అతడు ఇక్కడే ఉన్నాడు..

‘వికాస్ దూబే తీవ్ర ప్రతికారంతో చనిపోయాడు. అందుకే అతడు ఆత్మగా మారాడు. ప్రభుత్వం కూల్చివేసిన అతడి ఇంటి శిథిలాల కింద ఉంటున్నాడు. అతడు అక్కడ కూర్చోవడం నేను చూశా. అతడు తప్పనిసరిగా ప్రతీకారం తీర్చుకుంటాడు’ అంటూ ఓ వృద్ధుడు పేర్కొన్నాడు.  గ్రామానికి చెందిన పూజారి ఈ అంశం గురించి మాట్లాడుతూ.. ‘వికాస్ దూబేకు అంత్యక్రియలు సరిగ్గా పూర్తిచేయలేదు. అందుకే అతడు ఆత్మగా మారాడు’ అంటూ పూజారి వ్యాఖ్యానించారు.

అవన్నీ కట్టకథలే!

ఈ విషయం పై పోలీసులు స్పందించారు. వికాస్‌దూబే అనుచరులు కొందరు ఇటువంటి పుకార్లు పుట్టిస్తున్నారు. బిక్రూగ్రామంలో అలజడి సృష్టించేందుకు యత్నిస్తున్నారు. రోజురోజుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటివి పుకార్లను అవివేకులు మాత్రమే నమ్ముతారు. గ్రామంలో అలజడి సృష్టించేవారిని కొద్దిరోజుల్లోనే పట్టుకుంటాం. గ్రామస్థులు ఎవరూ ఇటువంటి పుకార్లు నమ్మొద్దు’ అంటూ పోలీసులు సూచించారు.
× RELATED పాతబస్తీలో డ్రగ్స్ దందా.. ముఠా అరెస్ట్
×