సోము వీర్రాజు గారు అది కూడా తెలియదా మీకు?

రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లా ఉండాలంటారు. అలాగే ఎంత దేశంలో అధికారంలో ఉన్నా.. హిందుత్వ ఏజెండాను నెత్తిన ఎత్తుకున్నా కానీ.. దాని బహిరంగంగా చూపించడం కరెక్ట్ కాదు.. ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏ పార్టీ అంటే ఏపీలో ఏ చిన్నపిల్లాడిని అడిగినా చెప్తారు. కానీ ఆయన దేవాలయాలకు కూడా పార్టీ జెండాలు వేసుకొని వెళుతూ షో చేయడంపై పలువురు సెటైర్లు వేస్తున్నారు.

ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఈరోజు విజయవాడలోని దుర్గ గుడిలోని రథాన్ని చూడడానికి వెళ్లాడు. అతడితోపాటు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వెళ్లారు. ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగి.. బీజేపీ తరుఫున ఒక రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడు అయిన సోము వీర్రాజుకి ఒక గుడిలోకి పోతున్నప్పుడు ఒక పార్టీ జెండా కప్పుకోకుండా వెళ్లాలని కూడా తెలియదా అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

దేవాలయానికి కానీ.. మసీదుకు గానీ.. చర్చికి గానీ పోయేటప్పుడు కండువాలు.. పార్టీ జెండాలు బయటపెట్టాలని కూడా తెలియదా అని అనుంటున్నారట.. ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా అంటున్నారు.
 
నేను సీనియర్ నాయకుడిని అని చెప్పుకుంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే సోము వీర్రాజుకి ఇది కూడా తెలియదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. దేవాలయాల్లోకి పోయి జెండాలు ప్రదర్శించడం ఏంటని అంటున్నారు. హిందుత్వం మీద పోరాడుతున్న సోము వీర్రాజు అవి అన్నీ బయట చేయాలని కానీ పార్టీ కండువా కప్పుకోవడం ఏంది అని కూడా నెటిజన్లు పలువురు కౌంటర్ ఇస్తున్నారు.
× RELATED పాతబస్తీలో డ్రగ్స్ దందా.. ముఠా అరెస్ట్
×