పాక్ మ్యాప్ లో కశ్మీర్ జునాగఢ్ .. వాకౌట్ చేసిన అజిత్ దోవల్

కశ్మీర్ జునాగఢ్ లను తన దేశంలో అంతర్భాగంగా చూపిస్తూ పాకిస్థాన్ రూపొందించిన పటంపై నిరసన వ్యక్తం చేస్తూ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ షాంఘై సహకార సంస్థ (ఎస్ సీవో) సభ్య దేశాల సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. రష్యా అధ్యక్షతన మంగళవారం ఆన్ లైన్ ద్వారా ఎస్సీవో సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాకిస్థాన్ ప్రతినిధి కూడా పాల్గొన్నారు.

కశ్మీర్ జునాగఢ్ లను తమ దేశంలో అంతర్భాగంగా చూపుతూ రూపొందించిన పటం ముందు ఆయన కూర్చున్నారు. ఈ   విషయాన్ని గమనించిన దోవల్.. ఆతిథేయి రష్యాను సంప్రదించిన అనంతరం సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు.
× RELATED పాతబస్తీలో డ్రగ్స్ దందా.. ముఠా అరెస్ట్
×