ఆన్లైన్ రమ్మీతో పిల్లలు ఆగం.. నిషేధం పెట్టండి

ఆన్ లైన్ రమ్మీని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేధించాలని.. ఈ ఆటతో చదువుకొనే పిల్లలు నాశనమవుతున్నారని బీజేపీ ఎంపీ కేసీ రామ్మూర్తి కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  చాలా మంది విద్యార్థులు నిరుద్యోగులు ఈ ఆటకు బానిసలయ్యారని చెప్పారు. దేశానికి వెన్నెముక లాంటి యువత రమ్మీ ఆటతో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నది చెప్పారు. మంగళవారం రామ్మూర్తి రాజ్యసభ లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘ రమ్మీ ఆటతో యువత తెలివితేటలు పెరుగవు. అది జూద క్రీడ. జూదం ఎంతో ప్రమాదకరమని పురాణాలు మనకు చెబుతున్నాయి. ధర్మరాజు లాంటి వ్యక్తే జూదమాడి సర్వస్వాన్ని కోల్పోయారు. ఈ మాయదారి ఆటతో ఎంతో మంది తమ ఆస్తులను అమ్ముకుంటున్నారు. ఇది ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లు ఉన్న ప్రతి వారిని ఆకర్షిస్తుస్తోంది. కాలక్షేప ఆటగా ప్రారంభమై ముందు రూ.1 రూ. 10 నుంచి ప్రారంభం అవుతుంది. చివరకు మన ఆస్తులన్నీ గుల్ల చేస్తుంది.

 సినీ హీరోయిన్లు ఈ గేమ్షో లకు ప్రచారం కల్పిస్తున్నారు. దీంతో యువత ఈ షోకు బానిస గా మారుతోంది. సినిమా వాళ్లు ఈ ఆన్ లైన్ రమ్మీ యాడ్స్ లో పాల్గొనకుండా నిషేధం విధించాలి.  ఈ ఆన్ లైన్ మనీ గేమింగ్ దందా మన దేశంలో రూ.2200 కోట్ల సామ్రాజ్యంగా విస్తరించిదని కేజీఎం నివేదిక అంచనా వేసింది.  ఇలాగే కొనసాగితే ఈ రమ్మీ వ్యాపారం 2023 నాటికి రూ.12వేల కోట్లకు చేరే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.’ అని ఎంపీ అభిప్రాయపడ్డారు. దీన్ని వెంటనే కేంద్రం నిషేధించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

× RELATED పాతబస్తీలో డ్రగ్స్ దందా.. ముఠా అరెస్ట్
×