న్యూసెన్స్ తో విసిగిపోయి స్టార్ డైరెక్టర్ గోవా బీచ్ కి పలాయనం!

పదే పదే డ్రగ్స్ కేసులో తన పేరును పాపులర్ చేసేందుకు కంగన లాంటి వాళ్లు చూపిస్తున్న ఉత్సాహం కరణ్ ని హర్ట్ చేసిందనే అర్థమవుతోంది. అంతేకాదు.. సుశాంత్ సింగ్ అనుమానాస్పద మరణం తర్వాత కొనసాగుతున్న వివాదాలు ఎదురు దెబ్బలు అతడిని కలచి వేసాయని ముంబై మీడియా చెబుతోంది.

బాలీవుడ్ దర్శకనిర్మాత.. ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ కొంతకాలంగా ఎలాంటి హడావుడి చేయడం లేదు. తాజా పరిణామాల నేపథ్యంలో కొన్నాళ్ల పాటు ఊపిరి పీల్చుకునేందుకు అలాగే ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి ముంబై నుండి బయలు దేరుతున్నట్లు జాతీయ మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి.

కరణ్ జోహార్ తన తల్లి పిల్లలతో కలిసి కుటుంబ సమేతంగా గోవాకు బయలుదేరారని తెలుస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తరువాత స్వపక్షపాతం నెపోటిజం అంటూ బోలెడంత రచ్చ అతడిని హర్ట్ చేసిందట. వాటి చుట్టూ చర్చలతో కరణ్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. చాట్ షో హోస్ట్ నీతు కపూర్ పుట్టినరోజు పార్టీకి హాజరైన ఫోటోలు సోషల్ మీడియాలోకి వచ్చినా.. అతనిని గుర్తించ లేకపోయారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం.. జోహార్ ముంబై విమానాశ్రయం లో కనిపించారు. అతని తో పాటు అతని తల్లి పిల్లలు ఉన్నారని గుసగుసలు వినిపించాయి.

కొంతకాలం పాటు తప్పించుకునేందుకే గోవాకు బయలుదేరారా? ఎందుకని కరణ్ జోహార్ ఇదివరకటిలా అక్కడ మీడియాకు పోజులు ఇవ్వలేదు? విమానాశ్రయ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ఆతురుత ఎందుని? అంటూ ముంబై మీడియా కథనాలు అల్లడం వేడెక్కించింది. కరణ్ జోహార్ నిర్మించిన `గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్` ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. అతను ప్రస్తుతం తన తదుపరి ముఖ్యమైన ప్రాజెక్ట్ `బ్రహ్మస్త్ర` కోసం సిద్ధమవుతున్నాడు. ఇందులో అమితాబ్ బచ్చన్- అలియా భట్- రణబీర్ కపూర్- నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రల్లో నటించారు. దీనికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. అతను దోస్తానా 2 - తఖ్త్ వంటి మరికొన్ని భారీ చిత్రాల్ని నిర్మించనున్నారు. అయితే వీటన్నిటా నెపోటిజం స్టార్లకు అతడు అవకాశాలివ్వడం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.
× RELATED 'డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తన జిప్ తీసి.. నా సల్వార్ కమీజ్ నాడా లాగాడు'
×