102 రోజుల తర్వాత.. న్యూజిలాండ్ లో మళ్లీ కరోనా

న్యూజిలాండ్.. కరోనా మహమ్మారి తమ దేశం నుంచి వెళ్లిపోయిందని ఆ దేశ వాసులు ఎంతో సంతోషించారు. ప్రపంచంలోనే కరోనాను జయించిన దేశంగా ఖ్యాతికెక్కింది. అన్ని దేశాలతోపాటు న్యూజిలాండ్ లోనూ కరోనా ప్రబలింది.కానీ అక్కడి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలతో ఈ వైరస్ ను అరికట్టింది. ఈ సముద్రంలోని ద్వీపదేశం కరోనా ఫ్రీగా ప్రకటించింది. మే 1 తర్వాత నుంచి గత 100 రోజులుగా ఒక్క కేసులు కూడా నమోదు కాకపోవడంతో రికార్డుల్లోకి ఎక్కింది. దీంతో న్యూజిలాండ్ వాసులు సాంఘిక దూరం పాటించకుండా సాధారణంగా జీవిస్తున్నారు.

అయితే తాజాగా 102 రోజుల అనంతరం పక్కనున్న ఆస్ట్రేలియా దేశం నుంచి వచ్చిన ఒక యువకుడి వల్ల ఆ దేశంలో మళ్లీ కరోనా కేసు నమోదైంది.

ఆస్ట్రేలియాలోని మెల్ బోర్డ్ నుంచి జూలై 30న న్యూజిలాండ్ కు వచ్చిన ఒక యువకుడికి తాజాగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

తొలుత కరోనా టెస్ట్ చేస్తే నెగెటివ్ రాగా.. తాజాగా 9రోజుల తర్వాత చేస్తే పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

కాగా ఈ కొత్త కేసుతో కలిపి న్యూజిలాండ్ దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య కేవలం 1220కి చేరడం గమనార్హం. కరోనాతో ఆ దేశంలో 22మంది మరణించారు.
× RELATED పాతబస్తీలో డ్రగ్స్ దందా.. ముఠా అరెస్ట్
×