గుంటూరులో బయటపడ్డ మరో హనీట్రాప్ !

హాయ్ హలో నేను మా వారికీ కాల్ చేయబోతే మీకు వచ్చింది. సారీ ! అయినా మీ వాయిస్ సూపర్ గా ఉంది.  నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా?.. మిమ్మల్ని నేరుగా కలవాలనుకుంటున్నా?’ అంటూ గుంటూరుకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి వల వేసేందుకు ప్రయత్నం చేసింది  ఓ మాయలేడి. అయితే దీన్ని మొగ్గలోనే పసిగట్టిన ఆ వ్యాపారీ ఆ మాయలేడి ట్రాప్ లో పడితే ఇక అంతే సంగతులు అని గ్రహించి ఆ ఘటన పై  సోమవారం గుంటూరు అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే .. గుంటూరులోని చంద్రమౌళి నగర్ కు చెందిన ఓ వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. క్రీడా విభాగం అసోసియేషన్ సెక్రటరీగా కూడా ఉన్న ఆయన కొన్ని రోజుల కింద ఈత కొలను సమస్యలపై ఉన్నతాధికారుల ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే ఓ మహిళ అతడికి ఫోన్ చేసింది. ఎవరని నిలదీయగా నా భర్తకు చేద్దామనుకుంటే.. మీ నెంబర్కు వచ్చిందంటూ.. ఒకసారి కలుద్దామా అని అనడంతో అనుమానం వచ్చింది. ఈత కొలనుపై ఫిర్యాదు చేయడంతో అక్కడి కోచ్ తనపై కక్షగట్టి ఇలా చేస్తున్నాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు.

ఆ మహిళ గుట్టురట్టు చేయడంతో తనపై నలుగురు యువకులతో దాడి చేయించారని బాధితుడు చెబుతున్నాడు. మహిళ తనతో మాట్లాడిన కాల్ డేటా పంపిన ఫొటోలతో పాటు తనపై దాడి చేసిన ఘటనపై పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించాడు. విచారణలో కోచ్ చెబితేనే తాను ట్రాప్ చేసేందుకు యత్నించానని మహిళ చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నాడు. ఈ కేసు  విచారణచేసేందుకు పోలీసులు తన దగ్గర డబ్బులు కూడా తీసుకున్నారని తెలిపాడు. అతడి ఫిర్యాదుపై స్పందించిన ఏఎస్పీ ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని పోలీసులకి ఆదేశాలు జారీచేశారు.
× RELATED పాతబస్తీలో డ్రగ్స్ దందా.. ముఠా అరెస్ట్
×