జగన్...ఇది నిజంగా గొప్ప నిర్ణయం

ఏపీ సీఎం వైయస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లో సరైన సమయాల్లో సరైన నిర్ణయం తీసుకోవడం ఎంత ముఖ్యమో...తన కోసం శ్రమించిన వారికి అండగా నిలవడం అంతే ముఖ్యమనే విషయాన్ని జగన్ మరోమారు నిరూపించారు. దివంగత సీనియర్ నాయకులు విజయనగరం జిల్లాకు చెందిన పెన్మత్స సాంబశివరాజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా విశాఖలోని ప్రేవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పెన్మత్స మృతి చెందారు. ఆయన తనయుడు డా. పెన్మత్స సూర్యనారాయణరాజు (డా.సురేష్బాబు)ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దింపాలని వైయస్.జగన్ నిర్ణయించారు.

ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటుకు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానానికి సురేష్ బాబు పేరును జగన్ నిర్ణయించారు. కాగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పెన్మత్స ప్రత్యేక స్థానం కలిగి ఉన్నారు. గజపతినగరం సతివాడ శాసనసభ స్థానాల నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా సాంబశివరాజు ఎన్నికయ్యారు. మాజీ మంత్రిగా ప్రొటెం స్పీకర్గా సాంబశివరాజు ఎన్నో పదవులు స్వీకరించి... ప్రజలకు సేవలందించిన నాయకుడిగా గుర్తింపు పొందారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక నాయకుడిగా డా. పెన్మత్స సూర్యనారాయణరాజు గుర్తింపు పొందారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన నాయకుడైన పెన్మత్సను గౌరవించడంలో భాగంగా ఏపీ సీఎం జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సీఎం వైయస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ తీసుకున్న నిర్ణయం పార్టీకి చేసి సేవలను గుర్తించడంలో భాగమని అంటున్నారు. తన కోసం శ్రమించిన వారికి గుర్తింపు దక్కుతుందని తగు న్యాయం చేస్తాననే బలమైన సంకేతాన్ని జగన్ పార్టీ నేతలకు పంపించారని పలువురు విశ్లేషిస్తున్నారు.
× RELATED పాతబస్తీలో డ్రగ్స్ దందా.. ముఠా అరెస్ట్
×