బిగ్ బాస్ ప్రియులకు చేదువార్త.. మళ్లీ వాయిదా..!!

టీవీలో ప్రసారం అయ్యే కొన్ని రియాలిటీ షోలు ప్రేక్షకుల పై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. అలాంటి రియాలిటీ షోలలో ఒకటి బిగ్ బాస్. గత మూడు సీసన్లుగా తెలుగు బుల్లితెరపై విజయవంతంగా ప్రదర్శించ బడుతుంది. కరోనా ప్రభావం తగ్గితే ఈ ఏడాది జులైలో లేదా ఇటీవలే ఆగష్టులో నాలుగో సీజన్ ప్రారంభించాలని నిర్వాహకులు భావించారు. కానీ కరోనా తగ్గలేదు బిగ్ బాస్ కుదరలేదు. నాలుగో సీజన్ ప్రారంభించాలని నిర్వాహకులు ఇదివరకే సమాచారం అందించారు. కానీ కరోనా ఇంతవరకు తగ్గలేదు బిగ్ బాస్ ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్లు హోస్ట్లతో నిర్వాహకులు ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే బిగ్ బాస్ రియాల్టీ షోలో కంటెస్టెంట్లుగా ఎవరు రానున్నారో అనే ప్రశ్న పై ఎన్నో ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అప్పటి వరకు ఎవరికీ తెలియని సెలబ్రిటీలు ఒక్కసారి బిగ్ బాస్ షోకి వెళ్తే వారి మొత్తం అసలు స్వభావం చరిత్ర అన్నీ బయట జనాలకు తెలుస్తాయి.

ముఖ్యంగా ఎదుటివారితో ఎలా ఉంటారనేది బిగ్ బాస్ ద్వారా తెలిసిపోతుంది. అసలు ఈ షో ఈసారి ప్రారంభం అవుతుందా లేదా అనే అనుమానం అందరిలోనూ ఏర్పడింది. బిగ్ బాస్ నిర్వాహకులు ఇదివరకు చెప్పినట్లుగానే స్టార్ మా ఛానల్లో ప్రసారం కానున్న బిగ్ బాస్-4 ప్రారంభం కానుందని ఓ ప్రోమో వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చేసారు. కానీ ఈసారి బిగ్ బాస్-4 ఆలస్యంగా మొదలు కాబోతోందట. ఆగస్టులో కాకుండా సెప్టెంబరులో ఈ షోని ప్రారంభించబోతున్నారని సమాచారం. బిగ్ బాస్ సెట్ కి సంబంధించిన కొన్ని పనులు పెండింగులో ఉన్నాయట. అంతేగాక కంటెస్టెంట్లను 14 రోజుల హోం క్వారెంటైన్లో ఉంచుతారట. క్వారెంటైన్ తరవాత కొవిడ్ పరీక్షల్ని మళ్లీ నిర్వహిస్తారు. ఆ పరీక్షల్లో అందరికి నెగిటీవ్ వచ్చిన తరవాతే.. షో ప్రారంభం కాబోతోంది. ఇదంతా జరగడానికి కాస్త టైమ్ పడుతుంది. అందుకే షో ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా త్వరలోనే బిగ్ బాస్ 4 అధికారిక తేదీని ప్రకటించనున్నారట. ఈ షోలో పాల్గొనే సెలబ్రెటీల లిస్టు ఆల్రెడీ లీక్ అయిపోయింది. కానీ ఫైనల్ లిస్ట్ ఏదనేది తెలియాల్సి ఉంది.
× RELATED శ్రావణి సూసైడ్.. అసలు కారకులు మారిపోయారు
×