సుశాంత్ చనిపోయే ముందురోజు నాతో మాట్లాడాడు : 'రేస్' ప్రొడ్యూసర్

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సుశాంత్ కేసులో రోజులు గడుస్తున్న కొద్దీ అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నేషనల్ మీడియా ఛానల్స్ సైతం సుశాంత్ కేసులో నిజాలు బయటపెట్టాలని స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలో స్ట్రింగ్ ఆపరేషన్స్ చేయడంతో పాటు డైలీ ఈ కేసుపై చర్చా వేదికల్లో సుశాంత్ సన్నిహితులతో మాట్లాడిస్తున్నారు. ఈ క్రమంలో 'రేస్' 'అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ' ప్రొడ్యూసర్ రమేష్ తౌరానితో సుశాంత్ ఫోన్ లో మాట్లాడాడని.. దీనిపై రమేష్ ని మాట్లాడవల్సిందిగా పలువురు జర్నలిస్టులు కోరుతున్న నేపథ్యంలో.. ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ ద్వారా సుశాంత్ గురించి పలు విషయాలు షేర్ చేసుకున్నారు రమేష్. సుశాంత్ చనిపోయే ముందురోజు తనతో ఫోన్ లో మాట్లాడింది నిజమేనని.. ఓ ప్రాజెక్ట్ గురించి చర్చించేందుకు మరో నిర్మాత నిఖిల్ అద్వానితో కలిసి జూన్ 13న మధ్యాహ్నం 2.15 నిమిషాలకు సుశాంత్ తో కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడినట్లు రమేష్ తౌరాని వెల్లడించారు.

గత కొన్ని రోజుల నుండి ప్రముఖ జర్నలిస్టుల నుండి నాకు చాలా కాల్స్ వస్తున్నాయి.. అందుకే దీనికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలనుకుంటున్నానని రమేష్ తౌరాని తెలిపారు. ''జూన్ 13న మధ్యాహ్నం నేను నిఖిల్ అద్వాని కలిసి సుశాంత్ కు ఒక స్టోరీ ఐడియా గురించి వివరించాము. సుశాంత్ తో పాటు అతని మేనేజర్ ఉదయ్ కూడా మాతో కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడాడు. మా మధ్య సినిమా గురించి సుమారు 15 నిమిషాల సంభాషణ కొనసాగింది. అయితే ప్రొఫెషనల్ కాల్ ద్వారా సుశాంత్ భావాలను అర్థం చేసుకోవలేకపోయాను'' అని రమేష్ తౌరాని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ గురించి తప్పుగా ప్రచారం చేయకుండా.. సిస్టమ్ మీద నమ్మకముంచి సుశాంత్ మరణంపై వాస్తవాలు వెలువడే దాకా అందరూ ఓపికతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. సుశాంత్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.. ఈ నమ్మలేని ట్రాజిక్ లాస్ నుండి బయటపడాలనుకుంటున్నాను.. దయచేసి ఎవరూ తరచూ కాల్ చేసి ఇబ్బంది పెట్టొదని కోరాడు రమేష్ తౌరాని.
× RELATED పవన్ కళ్యాణ్ రెండు పడవల మీద ప్రయాణం కొనసాగిస్తారా...?
×