ఆ హీరో చెప్పినట్లు రానా 'పర్మినెంట్ లాక్ డౌన్ కాబోతున్నాడా..?

టాలీవుడ్ టాల్ హీరో రానా.. తన పెళ్ళి ప్రకటన ఇలా బయట పెట్టాడో లేదో.. అలా సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీల కంట్లో పడింది. మరి వాళ్లు ఊరుకుంటారా.. ఈ మధ్య ఫ్యాన్స్ కంటే సెలబ్రిటీలే ముందుగా స్పందించడం ప్రారంభించారు. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ విష్ చేసేస్తున్నారు. కరోనా మహమ్మారి ఇచ్చిన సెలవులు కదా..  షూటింగ్స్ సినిమాలు లేక ఖాళీగా ఉంటూ.. సోషల్ మీడియాలో అలర్టుగా ఉంటున్నారని ఈ మధ్య వారి పోస్టులు చూస్తే అర్ధమవుతుంది. రానా తన పెళ్లి ప్రకటన ఫోటోతో సహా పోస్ట్ చేసేసరికి శుభాకాంక్షల వెల్లువ మొదలైంది. మాములుగా మోస్ట్ బ్యాచిలర్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటే ఓ వైపు సందడితో పాటు మరోవైపు ఫ్రెండ్స్ నుండి సరదా కామెంట్స్ వస్తూనే ఉంటాయి. పెళ్ళైతే ఫ్రీడమ్ పోయినట్లే.. ఇకపై లైఫ్ లో టార్చర్ మొదలవుతుంది.. ఇలాంటి కామెంట్స్ కామన్. ఇది పేద

గొప్ప అనే కాదు అందరి విషయంలో కూడా జరుగుతుంది. రానా పెళ్లి పై షాకింగ్ కామెంటుతో ఝలక్ ఇచ్చాడు స్టార్ హీరో అక్షయ్ కుమార్. ఈ రోజు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో రానా ప్రేయసి మిహీకను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇద్దరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా రానాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మాత్రం కాస్త డిఫరెంటుగా విష్ చేసి ట్రెండ్ అవుతున్నాడు. ''శాశ్వతంగా లాక్-డౌన్ అవ్వడానికి సరైన మార్గం. కంగ్రాట్స్ రానా. ఇక పై మీ జీవితం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నా'' అంటూ రానా-మిహీకల ఫోటో జతచేసి పోస్ట్ చేసాడు. అక్షయ్ పెట్టిన ట్వీట్ లో  'పర్మనెంట్ లాక్-డౌన్' అనేది నెట్టింట వైరల్ అవుతోంది. భలే చెప్పారు అక్షయ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
× RELATED పూరీ 'సెన్సాఫ్ హ్యూమర్'...!
×