అక్కినేని వారసుడి మూవీలో కోడలు కనిపించనుందా..?

ప్రస్తుతం యువహీరో అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీవాసు వాసు వర్మలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వరుస ప్లాపులలో ఉన్న బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎలాగైనా హిట్టు కొట్టాల్సిందే అనే కసితో హీరో అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ ఉన్నట్లు తెలుస్తుంది. వరుస పరాజయాలపాలు అయినప్పటికీ వీళ్లిద్దరి కాంబినేషన్ ఎలా కుదిరిందని అందరు ఆశ్చర్యపోయారు. కానీ భాస్కర్ రాసిన కథ కథనంలో దమ్ముందని అందుకే గట్టి నమ్మకంతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు నిర్మాతలు తెలుపుతున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డేతో కలిసి రొమాన్స్ చేస్తున్నాడు అఖిల్. ఇప్పటికే షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది.

కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి ఆగిపోయింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో హీరోయిన్ సమంత గెస్ట్ పాత్రలో కనిపించబోతుందని సమాచారం. ఇదివరకే మామగారు నాగార్జున 'మన్మథుడు-2' సినిమాలో రెండు నిమిషాలు కనిపించే పాత్ర చేసింది సమంత. ఇప్పుడు మరిది అఖిల్ కోసం కూడా అతిథిగా కనిపించనుందట. సినీవర్గాల సమాచారం ప్రకారం.. బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థ్ తన కథను మొదట్లో ఓ లేడీ స్కూటి ఎక్కి చెబుతూ ఉంటాడు కదా.. అలాగే ఈ సినిమాలో అఖిల్ తన కథను సమంతకు చెబుతాడేమో అని భారీగా ప్రచారం జరుగుతుంది. ఈ పాత్రను చాలా స్పెషల్గా భాస్కర్ డిజైన్ చేసాడని అంటున్నారు ఇక ఈ ఏడాదే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విడుదల కానుందట. మరి వదిన - మరిదిల స్క్రీన్ ప్రెజన్స్ చూడాలని అభిమానులలో ఆసక్తి నెలకొంది.
× RELATED మెగా మేనల్లుడు 'ఉప్పెన' తీరం దాటేనా...?
×